News March 19, 2025
జిల్లాలోనే ప్రథమ స్థానం కోట్‌పల్లి ప్రథమ స్థానం

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 20మండలాల పరిధిలో 100% ఇంటి పన్ను వసూలు చేసి జిల్లాలోనే కోట్‌పల్లి మండలం ప్రథమ స్థానంలో నిలిచింది. మండల వ్యాప్తంగా మొత్తం 18 గ్రామ పంచాయతీలకు గాను 18 గ్రామ పంచాయతీలో 100% ఇంటి పన్ను వసూలు చేసి పంచాయతీ అధికారులు సక్సెస్ సాధించారు. 2వవ స్థానంలో వికారాబాద్ 96%, మూడవ స్థానంలో బంట్వారం, ధరూర్ 94%, తాండూరు మండలం 74% చివరి స్థానంలో ఉంది.
Similar News
News March 19, 2025
IPL: ఆ మ్యాచ్ రీషెడ్యూల్ ?

ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన KKRvsLSG మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశముందని క్రీడా వర్గాలు తెలిపాయి. అదే రోజు శ్రీరామనవమి ఉండడంతో కోల్‌కతా వ్యాప్తంగా భారీగా ఊరేగింపులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఊరేగింపులకు, ఇటు మ్యాచుకు భద్రత కల్పించడం పోలీసులకు సవాలుగా మారనుంది. ఈ కారణంతో మ్యాచును రీషెడ్యూల్ చేసే ఛాన్సుంది. గత ఏడాది KKRvsRR మ్యాచునూ ఇదే కారణంతో వాయిదా వేశారు.
News March 19, 2025
దోచిన సొత్తును శ్మశానంలో దాచేవాడు: ఖమ్మం సీపీ

చాట్రాయి(M) చిత్తాపూర్‌కు చెందిన సురేందర్ దొంగతనాలు చేయడంలో టెక్నాలజీని ఉపయోగించాడని ఖమ్మం సీపీ సునీల్ దత్ మంగళవారం తెలిపారు. Google MAP ద్వారా సురేందర్ ఇంటిని మార్క్ చేసి, కొల్లగొట్టి, దొంగలించిన సొత్తును శ్మశానంలో దాచుకున్నాడని చెప్పారు. సదరు నిందితుడి నుంచి 461.19 గ్రాముల బంగారం, 425 గ్రాముల వెండి, రూ.3.32లక్షలు సీజ్ చేశామన్నారు. గత 3 నెలల్లో ఏలూరు, ప.గో.జిల్లాల్లో 43 కేసులు నమోదు అయ్యాయన్నారు.
News March 19, 2025
ఈ ఏడాది ఆ క్రేజీ మూవీకి పార్ట్-2!

క్రేజీ దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక అప్డేట్ ఇచ్చారు. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి పార్ట్-2 తీయనున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఈ సంవత్సరం కొన్ని బాకీలు తీర్చాలని పోస్ట్ చేశారు. దీంతో ENE2 రాబోతుందని సోషల్ మీడియాలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2018లో విడుదలైన ఈ నగరానికి ఏమైంది మూవీ యువతను విశేషంగా ఆకట్టుకుంది.