News January 17, 2026
జిల్లాలోనే మాజీ ఉపరాష్ట్రపతి

మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పండుగ సందర్భంగా జిల్లాలోని ఆయన స్వస్థలం వెంకటాచలం మండలంలోనే ఉన్నారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఆయనను పలువురు ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనను శుక్రవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిరువురు జిల్లా పరిస్థితుల గురించి మాట్లాడుకున్నారు.
Similar News
News February 17, 2026
కొత్తగా ఆలోచించండి: నెల్లూరు కలెక్టర్

ఉద్యానవన శాఖ అధికారులతో నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యానవన శాఖ అధికారులు మండలాల్లో ఓ ప్రత్యేక థీంతో పనిచేసి ఆ మండలాలకు గుర్తింపు వచ్చేలా చూడాలన్నారు. వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని.. అలా చేస్తేనే నెల్లూరు జిల్లా వైపు అందరిని ఆకర్షించేలా చేయగలమని చెప్పారు. కలువాయి, సైదాపురం, దుత్తలూరులోని కోల్డ్ స్టోరేజ్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News February 17, 2026
26న నెల్లూరులో ఏం జరగనుంది..!

నెల్లూరు ఈనెల 26వ తేదీ స్పెషల్ డేగా మారనుంది. మాజీ సీఎంవ జగన్ ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి నెల్లూరుకు రానున్నారు. అదే రోజు నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జరగనుంది. గతంలో వైసీపీ నుంచి ఎన్నికైన స్రవంతి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మెజార్టీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. ఎన్నిక నామమాత్రమే కానుంది. అయినప్పటికీ అదే రోజు నెల్లూరుకు జగన్ రావడం ఆసక్తి రేపుతోంది.
News February 17, 2026
26న నెల్లూరుకు జగన్..!

YCP అధినేత జగన్ ఈనెల 26న నెల్లూరుకు రానున్నట్లు సమాచారం. VPR కన్వెన్షన్ హాల్లో జరగనున్న వివాహానికి ఆయన హాజరుకానున్నారు. రైల్వే కోడూరుకు చెందిన వైసీపీ ముఖ్య నేత కుమారుడి వివాహంలో జగన్ పాల్గొంటారని సమాచారం.


