News February 23, 2025
జిల్లాలో అప్పుడే.. 37.5℃ ఉష్ణోగ్రతలు

రంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం అత్యధికంగా మొగల్‌గిద్దలో 37.5℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు ప్రోద్దటూర్, కాసులాబాద్, చందానవల్లి, తొమ్మిదిరేకుల 37.4, చుక్కాపూర్ 37.3, షాబాద్ 37.2, రెడ్డి పల్లి, మొయినాబాద్ 37.1, కేతిరెడ్డిపల్లి 37, తుర్కయాంజాల్ 36.8, మంగల్‌పల్లి 36.7, కేశంపేట్, యాచారం 36.6, కొత్తూరు, మహేశ్వరం 36.5, తోర్రూర్, కొండూర్గ్‌లో 36.4℃గా నమోదైంది.
Similar News
News February 23, 2025
ఆదివారం: HYDలో పతనమవుతున్న చికెన్ ధరలు

HYDలో చికెన్ ధరలు పతనం అవుతున్నాయి. KG మీద ఏకంగా రూ.18 నుంచి రూ.20 వరకు తగ్గించారు. శుక్రవారం KG స్కిన్ లెస్ రూ 168, విత్‌స్కిన్ KG రూ.148గా ఉండగా.. నేడు మోరోసారి భారీగా పడిపోయాయి. KG స్కిన్‌లెస్ రూ.152, విత్ స్కిన్ రూ. 133 చొప్పున అమ్మకాలు జరుపుతున్నారు. హోల్‌సేల్ దుకాణాల్లో ఇంకా తగ్గించి విక్రయిస్తున్నారు. రిటైల్ షాపుల్లో మాత్రం ధరలు యథావిధిగా ఉంటున్నాయి. మీ ఏరియాలో KG చికెన్ ధర ఎంత?
News February 23, 2025
HYD: 2030 నాటికి 1.27 కోట్ల జనాభా..!

జీహెచ్ఎంసీ పరిధిలో జనాభా వేగంగా పెరుగుతోంది. వివిధ సర్వేల ప్రకారం, ప్రస్తుతం 1.08 కోట్లు ఉన్న జనాభా 2030 నాటికి 1.27 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ పెరుగుదల దృష్ట్యా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ట్రాన్స్‌పోర్ట్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. HYD నగర విస్తరణతో పాటు సమతుల్య ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడ్డారు.
News February 23, 2025
HYD: సొంత చెల్లినే గర్భవతి చేసిన అన్న

అన్న, చెల్లెని గర్భవతిని చేసిన ఘటన HYDలో జరిగింది. బాధితుల వివరాలు..ప్రకాశం జిల్లాకు చెందిన భార్యభర్తలకు కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు విడాకులు తీసుకుని తల్లి, కుమార్తెలు విజయవాడలో, తండ్రి, కొడుకు HYDలో ఉంటున్నారు. పెద్ద చెల్లిని క్రిస్మస్‌కు సొంతూరు తీసుకెళ్లి తల్లికి అప్పజెప్పకుండా HYDకు వచ్చారు.కొన్నాళ్లకు కుమార్తె గర్భవతి అని తెలిసి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం బయటకొచ్చింది.