News November 23, 2024
జిల్లాలో ఎంఎస్ఎంఈ సర్వే పక్కాగా జరగాలి: కలెక్టర్

శ్రీ సత్య సాయి జిల్లాలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్థల స్థాపనకు సంబంధించిన సర్వే పక్కగా జరగాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పరిశ్రమల శాఖ అధికారులతో కలిసి సర్వే పనితీరు, నిర్వహణ, టర్నోవర్ తదితర అంశాలపై చర్చించారు. వాణిజ్య, వ్యాపార సేవా రంగ సంస్థలు, ఉత్పత్తిదారులకు ఎంఎస్ఎంఈ సర్వేపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News February 4, 2026
బెస్ట్ బ్యూటీషియన్ అవార్డు పొందిన అనంతపురం మహిళ

అనంతపురం నగరానికి చెందిన ప్రముఖ బ్యూటీషియన్ హసీనా బేగం ప్రతిష్టాత్మకమైన ‘బెస్ట్ బ్యూటీషియన్’ అవార్డును అందుకున్నారు. బెంగళూరులో కర్ణాటక బ్యూటీ పార్లర్ అసోసియేషన్ నిర్వహించిన బ్యూటెక్ ఎక్స్‌పోలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఎంతో గౌరవప్రదమైన, అనుకూలమైన ఈ వృత్తిలో రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు.
News February 4, 2026
శ్రీ సత్యసాయి: స్నేహితుడి చేతిలో దారుణ హత్య.. కారణమిదే!

ఆవేశంలో స్నేహితుడిని హత్య చేసిన ఘటన రొద్దం(M) పెదకోడిపల్లిలో జరిగింది. లింగమయ్య(28), మనోజ్ స్నేహితులు. ఓ వివాహేతర సంబంధం విషయమై వీరిద్దరూ కొన్నాళ్లుగా మాట్లాడుకోవడం లేదు. మంగళవారం మరికొందరు మిత్రులతో కలిసి గ్రామ శివారులో సమావేశమయ్యారు. వీరిద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా మనోజ్ ఆగ్రహంతో కత్తితో లింగమయ్య గొంతులో పొడిచాడు. లింగమయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మనోజ్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.