News September 4, 2025

జిల్లాలో ఎరువుల కొరత లేదు: జేసీ

image

జిల్లాలో ఎరువుల కొరత లేదని, సొసైటీలో అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం వీరవాసరంలోని శ్రీనివాస ట్రేడర్స్, సాయి లక్ష్మి ఫెర్టిలైజర్స్, వ్యవసాయ సహకార సంఘం గోదాములను ఆకస్మిక తనిఖీ చేశారు. యూరియా నిల్వల‌పై స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఎరువుల అమ్మకాలలో ప్రభుత్వ నియమాలను పాటించనిపై వారిపై చర్యలు తప్పవన్నారు.

Similar News

News September 4, 2025

వాహనాలను గూడ్స్ క్యారేజ్ గా మార్చుకోవాలి: కృష్ణారావు

image

మొబైల్ క్యాంటీన్‌గా రిజిస్టర్ అయిన వాహనాలను తక్షణమే గూడ్స్ క్యారేజ్‌గా మార్చుకోవాలని జిల్లా రవాణా అధికారి కృష్ణారావు గురువారం తెలిపారు. జిల్లాలో 334 మొబైల్ క్యాంటీన్ వాహనాలు రిజిస్టర్ అయి ఉన్నాయని, వాటి యజమానులు సోమవారంలోగా తమ వాహన పత్రాలతో రవాణా శాఖ కార్యాలయాలను సంప్రదించాలన్నారు. మొబైల్ క్యాంటీన్ నుంచి గూడ్స్ క్యారేజ్‌గా మార్చుకోవాలని కోరారు.

News September 4, 2025

పాలకొల్లు: సీఎం చంద్రబాబుకు మంత్రి నిమ్మల ఆహ్వానం

image

ఈ నెల 24న పాలకొల్లులో జరగనున్న తన కుమార్తె శ్రీజ వివాహానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని మంత్రి నిమ్మల రామానాయుడు ఆహ్వానించారు. గురువారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రామానాయుడు తన కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి, వివాహ ఏర్పాట్ల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు.

News September 4, 2025

ఏలూరు పాము కాటుకు గురై యువకుడి మృతి

image

ఉమ్మడి ప.గో జిల్లాలోని ద్వారక తిరుమల మండలం సూర్యచంద్రరావుపేటకు చెందిన అశోక్ (23) పాము కాటుకు గురై మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అశోక్ పొలం పనులు చేస్తూ తల్లిదండ్రులతో జీవిస్తున్నాడు. బుధవారం పొలం పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. బంధువులు అతన్ని భీమడోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.