News January 2, 2026

జిల్లాలో ఎరువుల కొరత లేదు: జేడీ

image

ప్రస్తుత దాళ్వా సీజన్‌లో జిల్లాలో యూరియాతో సహా ఎలాంటి ఎరువుల కొరత లేదని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సీజన్‌కు మొత్తం 35,576 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికే 4,686 టన్నులు సరఫరా చేశామన్నారు. శుక్ర, శనివారాల్లో రైల్వే రేక్ ల ద్వారా మరిన్ని నిల్వలు వస్తున్నాయని వెల్లడించారు. ఎరువుల లభ్యతపై రైతులు ఆందోళన చెందవద్దన్నారు.

Similar News

News January 2, 2026

జగిత్యాల: ‘పెన్షనర్లకు సత్వర సేవలు అందిస్తాం’

image

పెన్షనర్లకు ట్రెజరీ శాఖ ద్వారా సత్వర సేవలు అందిస్తామని జగిత్యాల జిల్లా ట్రెజరీ అధికారి సీహెచ్. సోఫియా తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ట్రెజరీ కార్యాలయంలో తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన 2026 టేబుల్, గోడ క్యాలెండర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న సంఘం ప్రతినిధులను అభినందించారు.

News January 2, 2026

KNR: ‘సాగు ఖర్చుల మేరకు రుణాలు అందించాలి’

image

రైతుల అవసరాలకు అనుగుణంగా బ్యాంకర్లు రుణాలు అందించాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లాల సాంకేతిక కమిటీ సమావేశం నిర్వహించారు. 2026-27 సంవత్సరానికి ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ఖరారుపై చర్చించారు. సాగు ఖర్చులు పెరిగిన దృష్ట్యా రుణ పరిమితిని పెంచాలని, ముఖ్యంగా వరి, పత్తి, నగదు పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు. నాబార్డ్, డీసీసీబీ అధికారులు పాల్గొన్నారు.

News January 2, 2026

BSNL వార్షిక ప్లాన్.. రూ.2,799తో డైలీ 3GB

image

యూజర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL అతి తక్కువ ధరకే వార్షిక ప్లాన్‌ను స్టార్ట్ చేసింది. రూ.2,799తో రీఛార్జ్ చేస్తే 365 రోజుల పాటు రోజుకు 3GB డేటా, 100 SMSలు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభించనున్నట్లు ప్రకటించింది. ప్రైవేట్ టెలికం సంస్థలతో పోల్చితే ఇదే తక్కువ కావడం విశేషం. గతంలో ఈ ప్లాన్ ధర రూ.2,399 (డైలీ 2GB)గా ఉండేది. 5Gతో పాటు వేగవంతమైన ఇంటర్నెట్ అందించాలని యూజర్లు కోరుతున్నారు.