News August 25, 2025

జిల్లాలో గణేష్ ఉత్సవాలపై సూచనలు: ఎస్పీ

image

నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల కమిటీ నిర్వాహకులు పర్మిషన్ ఆన్‌లైన్ ధ్వారా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. రహదారులు మూసివేసి గణేష్ మండపాలు వేయకూడదని హెచ్చరించారు. గణేష్ మండపాలకు విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News August 27, 2025

సంగారెడ్డి: ‘టొబాకో ఫ్రీ స్కూల్ ఛాలెంజ్’ పోటీలు

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఆదర్శ, కేజీబీవీ పాఠశాలల్లో ‘టొబాకో ఫ్రీ స్కూల్ ఛాలెంజ్’ పోటీలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పొగాకు రహిత సమాజాన్ని ప్రోత్సహించడమే ఈ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. పాఠశాలల్లో ర్యాలీలు, స్లోగన్స్, పెయింటింగ్ వంటి అంశాలపై పోటీలు నిర్వహించాలని, వాటికి సంబంధించిన నాణ్యమైన ఫొటోలు, వీడియోలను MyGov.inలో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

News August 27, 2025

యాదాద్రి: పండుగ పూట విషాదం.. వ్యక్తి మృతి

image

పండుగ పూట యాదాద్రి జిల్లాలో విషాదాన్ని నింపింది. భూదాన్ పోచంపల్లిలో వినాయక చవితి మండపానికి కవర్ కడుతూ ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు సతీశ్(38) మండప పనులు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా తడిగా ఉన్న మండపం పైనుంచి జారి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే అతడిని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News August 27, 2025

ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు- కలెక్టర్

image

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణపతి ఆశీస్సులతో జిల్లా అభివృద్ధి చెందాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో సంతోషంగా ఉండాలని చేపట్టే ప్రతి పనిలో విజయం చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణకు మట్టితో తయారుచేసిన గణపతి విగ్రహాలకు పూజలు జరపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.