News March 14, 2026
జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, మండల స్థాయి అధికారులు గ్రామాల్లో ప్రజల ఆందోళనలు తొలగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టర్ క్యాంపు ఆఫీస్ నుంచి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్‌తో కలిసి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా, భూభారతి దరఖాస్తుల పరిష్కారం, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు, పలు రెవెన్యూ అంశాలపై తహశీల్దార్లతో జూమ్ కాల్ ద్వారా సమావేశం నిర్వహించారు.
Similar News
News April 8, 2026
భద్రాచలంలో వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం

భద్రాద్రి క్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుక బుధవారం కనులపండువగా సాగింది. తెల్లవారుజామున స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం, బేడా మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిత్య కళ్యాణోత్సవంతో ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంతో నిండిపోయింది.
News April 8, 2026
అక్రమాలకు అడ్డాగా జగిత్యాల మున్సిపాలిటీ!

JGTL మున్సిపాలిటీలో ACB దాడులతో బల్దియా అధికారులపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. 5 ఏళ్లలో 4 ఆటోలు, ఒక ట్రాక్టర్ మిస్ అయినా ఎటువంటి చర్య తీసుకోకపోవడం, MNCL బిల్డింగ్‌కు 18 ఏళ్ల కింద టెండర్ వేసి, రీ-టెండర్ వేయకపోవడం, చెత్త సేకరణ వాహనాల రిపేర్, డీజిల్ వినియోగంలో లోపాలను ACB గుర్తించింది. దీంతో బల్దియాలో అనేక అక్రమాలు జరుగుతున్నట్లు పట్టణ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
News April 8, 2026
సీఎం పర్యటనలో ట్రిపుల్ ఐటీ ప్రస్తావన ఏదీ..?

బాసర పర్యటనలో ఆర్జీయూకేటీ సమస్యల గురించి చర్చ వస్తుందని ఆశించిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. పర్యటన పొడవునా ఎక్కడా విద్యార్థుల సమస్యల ప్రస్తావన రాకపోవడం గమనార్హం. అయితే, అంతకుముందే మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపస్‌ను సందర్శించి సమస్యలపై ఆరా తీయడం కొంత ఊరటనిస్తోంది. మంత్రి విద్యార్థుల వినతులను సీఎం దృష్టికి తీసుకెళ్లారని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.


