News March 4, 2025

జిల్లాలో జిరాక్స్ సెంటర్లు మూసేయాలి: ములుగు కలెక్టర్

image

ఇంటర్మీడియట్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేసినట్లు ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు సకాలంలో హాజరు కావాలన్నారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

Similar News

News February 28, 2026

ఖమ్మం: అదనపు కలెక్టర్‌కు తీన్మార్ మల్లన్న వినతి

image

భూదాన్ భూముల బాధిత కుటుంబాలకు అదే భూమిలో పునరావాసం కల్పించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని కోరారు. శనివారం తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్‌ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. తక్షణ సహాయం కింద ప్రతి బాధిత కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించాలని కోరారు. భూదాన్ భూముల విషయంలో పేదలపై మాత్రమే చర్యలు తీసుకోవడం అన్యాయమని లేఖలో ప్రస్తావించారు.

News February 28, 2026

మదీనా బస్సు ప్రమాద బాధితులకు ₹5L చొప్పున పరిహారం

image

TG: గత ఏడాది నవంబర్ 17న సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన <<18312045>>బస్సు ప్రమాదంలో<<>> 44 మంది HYD వాసులు చనిపోయిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు CM రేవంత్ ఈరోజు సచివాలయంలో ₹5లక్షల చొప్పున పరిహారం అందజేశారు. గాయపడిన ఒకరికి ₹3లక్షలు ఇచ్చారు. ‘దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించవు. కానీ బాధితుల కుటుంబాల పరిస్థితి చూసి సాయం ప్రకటించాం’ అని సీఎం తెలిపారు.

News February 28, 2026

అద్దంకి – శ్రీశైలం ఫ్రీ బస్సులో మహిళలను దించేసిన డ్రైవర్

image

ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో శనివారం నలుగురు మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. అద్దంకి నుంచి శ్రీశైలం వెళ్తున్న RTC బస్సులో మార్కాపురం డిపో వద్ద నలుగురు మహిళలు ఎక్కారు. అయితే బస్సు డ్రైవర్ తమ పట్ల దురుసుగా ప్రవర్తించి బలవంతంగా బస్సులోంచి కిందికి దించేశాడని మహిళలు RTC కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు.. మరెవరికీ ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.