News April 24, 2025

జిల్లాలో జూన్ మొదటి వారం వరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ: కలెక్టర్

image

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను జూన్ మొదటి వారం వరకు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. కమలాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో డీఆర్డీఏ ఐకేపీ ద్వారా కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గురువారం సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు.

Similar News

News April 24, 2025

టూరిజం ప్యాకేజీల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాలి: కలెక్టర్ 

image

ఎన్టీఆర్ జిల్లాను ప‌ర్యాట‌క హ‌బ్‌గా తీర్చిదిద్దే క్ర‌మంలో ప‌ర్యాట‌కుల‌కు మ‌ధురానుభూతి మిగిల్చేలా రూపొందించిన ప్ర‌త్యేక ప్యాకేజీల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, ఇందుకు సంబంధించి క‌ర‌ప‌త్రాల‌ను ఆక‌ర్ష‌ణీయంగా రూపొందించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. క‌లెక్ట‌రేట్‌లో టూరిజం ప్యాకేజీపై ప‌ర్యాట‌క‌, ఏపీ టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ అధికారుల‌తో సమావేశం నిర్వహించారు. 

News April 24, 2025

‘హిట్-3’ సినిమా నిడివి ఎంతంటే?

image

నాని, శైలేష్ కొలను కాంబినేషన్లో తెరకెక్కిన ‘హిట్-3’ మూవీకి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. మొత్తం సినిమా నిడివి 2.37:06 గంటలుగా ఉంది. సినిమాలో బూతు పదాల వాడుకను పరిమితం చేసింది. హింస ఎక్కువగా ఉన్న సీన్లలో మార్పులు సూచించింది. ఈ మూవీ మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా A సర్టిఫికెట్ మూవీస్‌కి 18+ వయసున్న అభిమానులనే థియేటర్లకు అనుమతించాలని సెన్సార్ బోర్డు పేర్కొంటుంది.

News April 24, 2025

సునీల్ కుమార్‌పై ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్ నమోదు

image

AP: సర్వీసు నిబంధనల ఉల్లంఘన, వివిధ అభియోగాలతో CID మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ప్రభుత్వం ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్ నమోదు చేసింది. ప్రభుత్వానికి తెలియకుండా ఆయన పలుమార్లు విదేశీ పర్యటనలు చేశారని తెలిపింది. జార్జియా పర్యటనకు అనుమతి తీసుకొని 2సార్లు UAE, మరోసారి ప్రభుత్వానికి తెలియకుండా స్వీడన్, ఇంకోసారి US వెళ్లారని పేర్కొంది. ప్రతి అభియోగంపై 30రోజుల్లో రాతపూర్వక జవాబివ్వాలని ప్రభుత్వం ఆయన్ను ఆదేశించింది.

error: Content is protected !!