News March 3, 2025

జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ టిఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా గృహాలకు సరఫరా అవుతున్న తాగునీటికి సంబంధించిన పైపులైన్లను తనిఖీ చేయాలని సూచించారు. వచ్చే మూడు నెలలు మంచినీటి ప్రణాళికలను తయారు చేసుకోవలన్నారు.

Similar News

News February 19, 2026

వ్యాపారులూ జాగ్రత్త.. ఆ ‘పేమెంట్ సక్సెస్’ సౌండ్ ఫేక్ కావొచ్చు!

image

అసలైన యాప్‌లను పోలి ఉండే నకిలీ పేమెంట్ యాప్స్‌తో కేటుగాళ్లు వ్యాపారులను నిలువునా ముంచుతున్నారు. ఈ ఫేక్ యాప్స్ అచ్చం ఒరిజినల్ లాగే కనిపిస్తూ పేమెంట్ అవ్వకపోయినా ‘సక్సెస్’ స్క్రీన్‌ను, సౌండ్‌ను క్రియేట్ చేస్తాయి. దీని నుంచి తప్పించుకోవాలంటే కేవలం కస్టమర్ ఫోన్ స్క్రీన్ చూడటం కాకుండా మీ సొంత యాప్‌లోని ట్రాన్సాక్షన్ హిస్టరీని చెక్ చేసుకోవడం లేదా బ్యాంక్ నుంచి వచ్చే SMS పైనే ఆధారపడాలి.

News February 19, 2026

శ్రీవారికి శనివారం అంటే ఎందుకు ప్రీతి?

image

ఓంకారం ఆవిర్భవించిన రోజు, శ్రీవారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకొన్న రోజు, భక్తులకు మొదటిసారి దర్శనమిచ్చిన రోజు శనివారమే. తనను భక్తితో కొలిచే భక్తులను శనీశ్వరుడు పీడించడని స్వామికి వరం ఇచ్చిన కారణంగా ఈ వారం పవిత్రమైంది. ఆలయ నిర్మాణం, స్వామివారి గృహ ప్రవేశం, సుదర్శన చక్రం పుట్టుక కూడా ఈ రోజే జరిగాయని చెబుతారు. అందుకే శనివారాల్లో ఏడు కొండలవాడిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.

News February 19, 2026

IIM లఖ్‌నవూలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

<>IIM<<>> లఖ్‌నవూ ఎంటర్‌ప్రైజ్ ఇంక్యుబేషన్ సెంటర్‌లో 4 అసిస్టెంట్ మేనేజర్ ప్రోగ్రామ్స్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీటెక్, ఎంబీఏ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఏడాదికి రూ.3.60లక్షలు-రూ.5.40లక్షలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.iiml.ac.in