News October 21, 2025

జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

image

గడిచిన 24 గంటల్లో జగిత్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. పెగడపల్లిలో అత్యధికంగా 29.3 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. తిరమలాపూర్‌లో 3.8 మిల్లీమీటర్లు, పుడూర్‌లో 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా, జిల్లాలో పంట పొలాలు చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు వాతావరణ కేంద్రం జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News October 21, 2025

HYD: BRS నేతల మాటలు హాస్యాస్పదం: మంత్రి

image

మాఫియా, డాన్లు, కాంట్రాక్టులు, కమీషన్ల గురించి BRS నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. బ్లాక్ మెయిలింగ్ చేయడంలో బాల్క సుమన్ దిట్ట అని విమర్శించారు. RS ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ మంత్రుల గురించి మాట్లాడే ముందు KCR పదేళ్ల పాలనపై ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. KCR హయాంలో గురుకులాలు అస్తవ్యస్తంగా అయ్యాయన్నారు.

News October 21, 2025

NGKL: మద్యం దుకాణాలకు 1,427 దరఖాస్తులు

image

నాగర్‌కర్నూల్ జిల్లాలోని 67 మద్యం దుకాణాలకు మంగళవారం సాయంత్రం నాటికి 1,427 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. ఈనెల 23 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ పరిధిలో 424, కల్వకుర్తి పరిధిలో 431, కొల్లాపూర్ పరిధిలో 188, తెలకపల్లి పరిధిలో 147, అచ్చంపేట పరిధిలో 237 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.