News September 24, 2025

జిల్లాలో నాటు సారాను పూర్తిగా నిర్మూలించండి: కలెక్టర్

image

జిల్లాలో నాటు సారాను పూర్తిగా నిర్మూలించే చర్యలు తీసుకోవాలని, సారా వల్ల జరిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించాలని నవోదయం సమావేశంలో అధికారులను కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన నాటుసారా నిర్మూలనపై సమీక్షా సమావేం జరిగింది. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు.

Similar News

News September 25, 2025

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్ల వద్ద వెంటనే బారికేడింగ్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. గుర్తించిన 84 అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. రాత్రిపూట ప్రమాదాల నివారణకు రోడ్లపై రోడ్ స్టడ్స్ (సూచికలు), సీసీ కెమెరాలను అమర్చాలని సూచించారు.

News September 24, 2025

ప్రతి విద్యాసంస్థల్లో నో డ్రగ్స్: ఎస్పీ

image

జిల్లాలో ప్రతి విద్యాసంస్థల్లో నో డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలో 250 పాఠశాలలో ఈగల్ టీములను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తామన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

News September 24, 2025

దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

దసరా సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లే ప్రజలు ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం వెల్లడించారు. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో ఉంచాలన్నారు. ఇంటి బయట లోపల ఒకటి లేదా రెండు లైట్లు వేసి ఉంచాలని, సాధ్యమైనంత వరకు ఇళ్లకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలన్నారు. సెలవులు ముగిసేంత వరకు కాలనీలలో సంక్షేమ సంఘాలు గస్తీని ఏర్పాటు చేసుకోవాలన్నారు.