News October 31, 2025

జిల్లాలో పంట ధాన్యాల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది: నిర్మల్ కలెక్టర్

image

జిల్లాలో పంట ధాన్యాల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామన్నారు. నేటి వరకు జిల్లాలో 10 సోయాబీన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభించడంతోపాటు, ఈరోజు వరకు మొత్తం 29,100 క్వింటాళ్ల మొక్కజొన్న పంటను కొన్నామన్నారు.

Similar News

News October 31, 2025

PRG: ఉ‘సిరి’కి భారీ డిమాండ్

image

పరిగి పట్టణంతో పాటు పలు గ్రామాలలో ఉసిరికాయలకు చాలా డిమాండ్ పెరిగింది. కార్తీకమాసం కావడంతో కొనుగోళ్లు పెరిగాయి. దేవాలయాల్లో విష్ణువు, శివుడి వద్ద ఉసిరి దీపాలు వెలిగించడానికి మహిళలు, యువతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పరిగి మార్కెట్‌లో 250గ్రా. ఉసిరి రూ.30-50 అమ్ముతున్నారు. కాయ, ఆకులు గల ఉసిరి కొమ్మను రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.

News October 31, 2025

నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ ఇవాళ్టి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు కోరుతూ నేడు వెంగళరావునగర్, సోమాజీగూడ డివిజన్లలో జరిగే సభల్లో పాల్గొంటారు. రేపు బోరబండ, ఎర్రగడ్డ, 4న షేక్‌పేట్-1, రహమత్ నగర్, 5న షేక్‌పేట్-2, యూసుఫ్‌గూడలో రోడ్ షో, 8, 9తేదీల్లో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో ఆయన రాత్రి 7 గంటల నుంచి ప్రచారంలో పాల్గొంటారు.

News October 31, 2025

వీపనగండ్ల: మైనర్ బాలికకు నిశ్చితార్థం: నలుగురిపై కేసు

image

వీపనగండ్ల మండలంలో 15 ఏళ్ల మైనర్ బాలికకు నిశ్చితార్థం జరిపించినందుకు పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు గురువారం చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మాయి తల్లి, అబ్బాయి, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాణి తెలిపారు. మైనర్‌ను వివాహమాడిన, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.