News October 25, 2025

జిల్లాలో పాఠశాలలకు 3 రోజులు సెలవులు: కలెక్టర్

image

మొంథా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఈనెల 27 నుంచి 29 వరకు 3 రోజులు సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ప్రకటించారు. ఉపాధ్యాయులు మాత్రం స్కూళ్లకు హాజరు కావాలన్నారు. శిథిలావస్థలో ఉన్న వసతి గృహాలలోని విద్యార్థులను ఇళ్లకు పంపించాలన్నారు. సమాచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలియజేయాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News October 26, 2025

దేశం పరువును గంగలో కలిపారు.. బీజేపీపై కాంగ్రెస్ ఫైర్

image

MPలో ఆసీస్ మహిళా క్రికెటర్లను అసభ్యంగా తాకిన ఘటన రాజకీయ విమర్శలకు దారితీసింది. లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే ఘటన జరిగిందని, దేశం పరువును గంగలో కలిపారని అధికార BJPపై కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోంది. CM బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని కావాలనే రాజకీయం చేస్తోందని BJP కౌంటర్ ఇచ్చింది. నిందితుడిపై తక్షణ చర్యలు చేపట్టామని, ఇలాంటి వాటిని సహించేదే లేదని స్పష్టం చేసింది.

News October 26, 2025

వైద్య సిబ్బంది 24hrs అందుబాటులో ఉండాలి: మంత్రి సత్యకుమార్

image

AP: మొంథా తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టే వరకు డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు ఆరోగ్య కేంద్రాల్లో ఉండాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. వాతావరణ సూచనలతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అంబులెన్సులు, ఫీడర్ వెహికల్స్ మ్యాపింగ్ చేశామని వైద్యారోగ్య శాఖ CS సౌరభ్ గౌర్ తెలిపారు. ఎపిడమిక్ సెల్, ఎమర్జెన్సీ టీమ్‌లు సిద్ధం చేశామన్నారు.

News October 26, 2025

గుంటూరు: ‘ఈ సమస్యలు వస్తే కాల్ చేయండి’

image

గృహ హింస చట్టం 2006 అక్టోబర్ 26 అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగా మహిళల రక్షణ, న్యాయం కోసం అధికారుల పర్యవేక్షణలో కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. మహిళలపై హింస, వేధింపులు, దౌర్జన్యాలు ఎదురైనప్పుడు వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గుంటూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ గృహ హింస చట్టం శాఖను సంప్రదించవచ్చు. లీగల్ కౌన్సిలర్ : 8639687689, సోషల్ కౌన్సిలర్: 8074247444.