News March 26, 2026
జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతలేదు: కలెక్టర్

NTR జిల్లాలో పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ లక్ష్మిశ స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 176 పెట్రోల్ బంకులు సక్రమంగా పనిచేస్తున్నాయన్నారు. వదంతులను నమ్మి ప్రజలు అనవసరంగా ఎక్కువ మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేసి కృత్రిమ కొరత సృష్టించవద్దని సూచించారు. క్యాన్లు, డబ్బాలలో పెట్రోల్, డీజిల్ తీసుకెళ్లడం పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News April 8, 2026
IPL: గిల్ రీఎంట్రీ.. GT బోణీ కొడుతుందా?

ఐపీఎల్‌లో ఈరోజు ఢిల్లీ వేదికగా DC, GT రా.7.30 గంటలకు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో DC ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి ఫామ్‌లో ఉండగా, GT ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. దీంతో ఈరోజైనా గెలిచి ఆ జట్టు బోణీ కొడుతుందేమో చూడాలి. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 7 సార్లు తలపడగా, GT 4 విజయాలతో పైచేయి సాధించింది. కండరాల నొప్పితో గత మ్యాచ్‌కు దూరమైన గుజరాత్ కెప్టెన్ గిల్ ఈ మ్యాచులో ఆడనున్నారు.
News April 8, 2026
చిన్న వెంకన్న ఆలయ అక్రమాలపై రాజకీయ ఒత్తిళ్లు!

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో నకిలీ టికెట్ల కుంభకోణం కలకలం రేపుతోంది. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకోగా విచారణలో మరిన్ని పేర్లు బయటపడ్డాయి. అయితే, నిందితులను కాపాడేందుకు రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నట్లు సమాచారం. కొందరిపైనే కేసులు పెట్టి, మిగిలినవారిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని భక్తులు ఆందోళన చెందుతున్నారు. దోషులందరిపై చర్యలు తీసుకుని ఆలయ పవిత్రతను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
News April 8, 2026
ఇరాన్‌కు డెడ్‌లైన్ గడువును పొడిగించిన ట్రంప్

ఇరాన్‌కు విధించిన డెడ్‌లైన్ గడువును 2 వారాలపాటు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. <<19594813>>పాక్ అభ్యర్థన<<>> మేరకు 14 రోజులపాటు దాడులు నిలిపివేసేందుకు అంగీకరించానన్నారు. ‘హార్ముజ్‌ను వెంటనే తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందన్న షరతుకు లోబడి దీనికి నేను ఒప్పుకున్నా. ఈ సీజ్‌ఫైర్ ఇరువైపులా వర్తిస్తుంది. ఇరాన్ 10 పాయింట్ల ప్రపోజల్ అందింది. శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.


