News August 14, 2025
జిల్లాలో పెరిగిన భూగర్భ జల నీటిమట్టం: కలెక్టర్

గతేడాదితో పోలిస్తే ఈసారి జిల్లాలో భూగర్భ జలమట్టం సగటున 2.26 మీటర్ల మేర పెరిగిందని కలెక్టర్ పి.అరుణ్ బాబు సీఎం చంద్రబాబుకు వివరించారు. సాగునీటి సబ్‌మెగా సభ్యులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, కలెక్టర్ సాగర్ ఛైర్మన్ కాంతారావుతో కలిసి పాల్గొన్నారు. భారీగా చేపడుతున్న ఫారం పాండ్ నిర్మాణాల కారణంగా వచ్చే ఏడాదికీ జలమట్టం పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
Similar News
News August 14, 2025
3 దశాబ్దాల తర్వాత నచ్చినవారికి ఓటేశారు: పవన్

AP: మూడు దశాబ్దాల తర్వాత పులివెందులలో ఓటర్లు తమకు నచ్చిన వారికి ఓటేశారని Dy.CM పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల్లో గెలిచినవారికి అభినందనలు తెలిపారు. ‘గతంలో అక్కడ నామినేషన్లు కూడా వేయనీయలేదు. వేద్దామనుకున్నవారిపై దాడులకు తెగబడ్డారు. ఏకగ్రీవం పేరుతో ఎవరూ పోటీలో లేకుండా చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి’ అని పేర్కొన్నారు.
News August 14, 2025
జడ్చర్ల: గల్లంతైన యువకుడి ఇతడే..!

చేపలు పట్టేందుకు వెళ్లి ఓ యువకుడు గల్లంతైన చెందిన సంఘటన జడ్చర్ల పట్టణంలో జరిగింది. స్థానికులు వివరాలు ప్రకారం.. పట్టణంలోని బోయలకుంటకు చెందిన భాను (24) కు ఏడాది క్రితం పెళ్లయింది. ఈరోజు సాయంత్రం వంద పడకల ఆసుపత్రి సమీపంలో చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. పక్కనే ఉన్న ఓ మిత్రుడు కాపాడే ప్రయత్నం చేసిన వరద నీటిలో కొట్టుకుపోయాడని స్థానికులు అన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు.
News August 14, 2025
ఆదిలాబాద్: ఉద్యాన వన విస్తరణ అధికారుల బాధ్యతల స్వీకరణ

ఆదిలాబాద్ జిల్లా ఉద్యాన వన, పట్టు పరిశ్రమ శాఖలో నూతనంగా ఉద్యాన వన విస్తరణ అధికారులు నియమితులయ్యారు. జైనథ్ మండలానికి గణేశ్, బోథ్ మండలానికి భూమయ్య, తాంసి మండలానికి శైలజ, గుడిహత్నూర్ మండలానికి సతీశ్ ఉద్యాన వన విస్తరణాధికారులుగా పట్టు పరిశ్రమ ఉన్నతాధికారి నర్సయ్య ఆధ్వర్యంలో గురువారం బాధ్యతలు చేపట్టారు.