News March 30, 2024

జిల్లాలో పెరుగుతున్న బ్రూణహత్యలు

image

ఖమ్మం జిల్లాలో అడ్డూఅదుపు లేకుండా బ్రూణహత్యలు జరుగుతున్నాయని ఇటీవల ఘటనల ద్వారా తెలుస్తోంది. లింగ నిర్ధారణ పరీక్ష చేయించడం, కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు చిదిమేస్తున్నారు . లింగ నిర్ధారణ నేరమైనా ఆస్పత్రులు, స్కానింగ్‌ సెంటర్లకు అదేమీ పట్టడం లేదు. దీంతో క్రమంగా ఆడశిశువుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు గాను 929 అమ్మాయిలే ఉన్నారు.

Similar News

News February 27, 2026

ఖమ్మం: విద్యుత్తు సమస్యల పరిష్కారానికి ‘వాట్సాప్‌’

image

విద్యుత్తు వినియోగదారుల సమస్యల త్వరితగతిన పరిష్కారానికి 7901628348 నంబరుతో వాట్సాప్‌ చాట్‌ బాట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసచారి తెలిపారు. వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈ నంబరుకు ‘Hi’ అని పంపి ఫిర్యాదు చేయవచ్చన్నారు. కంప్లైంట్‌ ఐడీ ద్వారా సమస్య పరిష్కారాన్ని ట్రాక్ చేయవచ్చని, పారదర్శక సేవలే సంస్థ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

News February 27, 2026

ఖమ్మం: విద్యార్థుల్లో పెరుగుతున్న దృష్టి లోపాలు

image

రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద జిల్లాలో నిర్వహించిన కంటి పరీక్షల్లో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. సెల్‌ఫోన్ల వాడకం, పోషకాహార లోపంతో 42,277 మంది విద్యార్థులను పరీక్షించగా, 2,297మందిలో దృష్టి లోపాలున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి త్వరలోనే కళ్లజోళ్లు పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో గుండె జబ్బులు, ఇతర శారీరక లోపాలున్న విద్యార్థుల కోసం వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.

News February 27, 2026

BREAKING.. డీజీపీ శివధర్ రెడ్డి ఖమ్మం పర్యటన రద్దు

image

డీజీపీ శివధర్ రెడ్డి నేటి ఖమ్మం పర్యటన అనివార్య కారణాలతో రద్దయింది. కొత్త పోలీస్ భవనాల ప్రారంభోత్సవం, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పర్యటన మళ్లీ ఎప్పుడు ఉండేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.