News February 16, 2025

జిల్లాలో ప్రశాంతంగా సేవాలల్ జయంతి వేడుకలు:ఎస్పీ

image

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఎలాంటి అవాంఛనియ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నథ్ కేకన్ తెలిపారు. నిన్న సాయంత్రం ఇరు వర్గాల మధ్య కొద్దీ పాటి అలజడి జరిగినప్పటికి పోలీస్ వారి ఆదేశాల మేరకు బందోబస్త్ నడుమ ఈరోజు సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసినందుకు అధికారులకు, ప్రజలకు ఎస్పీ అభినందనలు తెలిపారు.

Similar News

News January 9, 2026

21న రంగోత్సవ్ పోటీలు: శ్రీకాకుళం DEO

image

గార మండలం వమరవెల్లి డైట్ కళాశాలలో జనవరి 21న జిల్లాస్థాయి రంగోత్సవ్ పోటీలు నిర్వహిస్తామని శ్రీకాకుళం DEO రవిబాబు శుక్రవారం ఓ ప్రకటలో తెలిపారు. భారత స్వాతంత్ర్య సమరయోధులు చిత్రాలు గీయటం, కొటేషన్లతో కూడిన హ్యాండ్ రైటింగ్, పంజాబి జానపద నృత్య పోటీలు ఉంటాయని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని కోరారు.

News January 9, 2026

NZB: వ్యభిచార గృహాలపై CCS టీం మెరుపు దాడి

image

నిజామాబాద్ CCS ఇన్‌ఛార్జి ఏసీపీ మస్తాన్‌వలి ఆధ్వర్యంలో శుక్రవారం వ్యభిచార గృహాలపై మెరుపు దాడి నిర్వహించారు. రూరల్ పోలీస్ స్టేషన్, 6వ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వ్యభిచార గృహాలపై రైడ్ చేశారు. నలుగురు విటులు, ఐదుగురు మహిళలను పట్టుకున్నారు. రూ.27,290 నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్ SHOలకు అప్పగించారు.

News January 9, 2026

అమరావతి ఆవకాయ ఉత్సవాల్లో కలెక్టర్

image

విజయవాడ భవానీ ద్వీపంలో నిర్వహించిన ఆవకాయ్‌ సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమరావతోత్సవంలో కలెక్టర్ లక్ష్మీశా పాల్గొన్నారు. రెండో రోజు చేపట్టిన కార్యక్రమాలు నగరవాసులు, పర్యాటకుల నుంచి విశేష స్పందనను పొందాయి. మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు, నగాడా వాయిద్యాలు ప్రాంతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించగా, సంప్రదాయ కళల పరిరక్షణలో ఇలాంటి ఉత్సవాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయని కలెక్టర్ పేర్కొన్నారు.