News March 30, 2025
జిల్లాలో భారీగా సీఐల బదిలీలు

కర్నూలు రేంజ్ పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం రేంజ్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. కర్నూలు, కడప జిల్లాలో దాదాపు 16 మంది సీఐలను బదిలీ చేశారు. ఇందులో కొంతమందికి పోస్టింగ్ ఇవ్వగా మరికొంతమంది సీఐలను విఆర్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 11, 2025
ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ గ్రౌండ్ బకాయిల వివరాలు

ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేలంపై కౌన్సిల్ సమావేశంలో 24 గంటలు ఉత్కంఠత అనంతరం ఆమోదం తెలిపారు. 9 ఏళ్లుగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు మున్సిపాలిటీకి బకాయిలు పెడుతూనే ఉన్నారు. వాటి వివరాలు (లక్షలలో)..
2015లో రూ.3.96, 2016లో రూ.3.13, 2017లో రూ.2, 2018లో రూ.4.75, 2019లో రూ.8.02, 2021లో రూ.7.10, 2022లో రూ.30.06, 2023లో రూ.5.66, 2024లో రూ.31.50 బకాయిలు మున్సిపాలిటీకి రావాల్సి ఉంది.
News September 11, 2025
ప్రొద్దుటూరు: రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

ప్రొద్దుటూరు జార్జ్ కారొనేషన్ క్లబ్లో బుధవారం ఎస్జీఎఫ్ఐ జిల్లా స్థాయి అండర్ 14, 17 బాల బాలికల ఫెన్సింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభను చూపిన 40 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ఐ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాజుపాలెం ఎంఈవో ప్రసాద్, హెచ్ఎం ఇమామ్ హుస్సేన్, పీడీలు పోటీలను పర్యవేక్షించారు.
News September 10, 2025
కడప: కంట్రోల్ రూమ్ ఏర్పాటు

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి కడప జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతుందని కలెక్టర్ శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేపాల్‌లో ఉన్న ఏపీ వాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో కంట్రోల్ రూమ్ నంబర్ 08562-246344 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.