News March 3, 2025
జిల్లాలో మావోయిస్టు కదలికలు లేవు: ములుగు SP

ములుగు జిల్లాలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా అంతరించిపోయాయని SP శబరిశ్ స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని 25 ఏళ్ల తర్వాత ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారికి అడ్డుగా ఉన్న గేట్లు తెరిచి వాహనాల రాకపోకలకు అనుమతి కల్పించామన్నారు. 2001లో పీపుల్స్ వార్ సభ్యులు ట్రాక్టర్లలో మందుపాతరలు అమర్చి స్టేషన్ పేల్చివేశారని, అయితే ప్రస్తుతం జిల్లాలో వారి కార్యకలాపాలు లేవన్నారు.
Similar News
News March 3, 2025
వారానికి 60 గంటల పని: గూగుల్ కో ఫౌండర్

ఉద్యోగులను యంత్రాలుగా చూస్తున్న వారి జాబితాలోకి గూగుల్ కో ఫౌండర్ సెర్జీ బ్రిన్ కూడా వచ్చేశారు. ఇప్పటికే నారాయణమూర్తి, L&T సంస్థల ఫౌండర్లు 70 గంటలు పనిచేయాలని కామెంట్ చేయగా, సెర్జీ బ్రిన్ కూడా ఇలానే మాట్లాడారు. ‘AI రేసులో నిలవాలంటే వారానికి 60 గంటలు పనిచేయాలి. ప్రతిరోజూ ఆఫీసుకు రావాలి. అప్పుడే మంచి ప్రొడక్టివిటీ వస్తుంది. ఈ రేసులో మనం నిలవాలి, గెలవాలంటే తప్పదు’ అని ఆయన ఉద్యోగులకు నోట్ రాశారు.
News March 3, 2025
HYD: ‘కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి’

కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి చర్చకు సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు పనులు ప్రారంభమయ్యాయని, మెట్రో విస్తరణ కూడా కాంగ్రెస్ హయాంలోని జరుగుతుందన్నారు. ఏ కులానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదన్నారు.
News March 3, 2025
280 మంది ఇంటర్ పరీక్షలు రాయలేదు: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో సోమవారం ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 280 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. జనరల్, వొకేషనల్ విభాగాలకు కలిపి మొత్తం 12,318 మంది విద్యార్థులకు గాను 12,038 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదని కలెక్టర్ స్పష్టం చేశారు.