News August 18, 2025
జిల్లాలో యూరియాకు కొరత లేదు: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ జిల్లాలో రైతులకు యూరియా కొరత లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 70 శాతం మంది రైతులు యూరియాను కొనుగోలు చేశారని, ప్రణాళిక ప్రకారం యూరియా అందిస్తున్నామన్నారు. సోమవారం మంత్రి తుమ్మల, సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో యూరియా లభ్యత, పంపిణీ గురించి వివరించారు.
Similar News
News August 18, 2025
NLG: ప్రజావాణికి డుమ్మాపై కలెక్టర్ ఆగ్రహం

నల్గొండ జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫోకస్ పెట్టారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కలెక్టర్ దృష్టి సారించారు. ఇదిలా ఉండగా ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి కొంత మంది జిల్లా స్థాయి అధికారులు డుమ్మా కొడుతున్నారు. ప్రజావాణికి హాజరు కాకుండా.. కింది స్థాయి సిబ్బందిని పంపించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
News August 18, 2025
భూముల హద్దుల నిర్ధారణకు… కొత్త సర్వే మాన్యువల్!

జిల్లాలో భూముల హద్దులను నిర్ధారించేందుకుగాను కొత్త సర్వే మాన్యువల్ ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. గత పదేళ్ల కాలంలో సర్వే విభాగం పూర్తి నిర్లక్ష్యానికి గురైన విషయం తెలిసిందే. ప్రజా పాలనలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా సర్వే వ్యవస్థకు నూతన హంగులు తెస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. దీంట్లో భాగంగా ఇవాల్టి నుంచి లైసెన్సుడ్ సర్వేలకు రెండో విడత శిక్షణ ఇస్తున్నారు.
News August 18, 2025
NLG: నల్గొండ కూల్.. చల్లబడ్డ వాతావరణం!

నల్గొండ జిల్లాలో వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం మొత్తం చల్లబడింది. దీంతో గ్రామాలతో పాటు పట్టణాల్లో చలి తీవ్రత పెరుగుతుండడంతో గజగజ వణికి పోతున్నారు. గత రెండు రోజులుగా చలి తీవ్రత కారణంగా జనాలు ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో వృద్ధులు, చిన్నారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.