News September 8, 2025
జిల్లాలో యూరియా కొరతలేదు: అసిస్టెంట్ కలెక్టర్

జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులెవరు ఆందోళన చెంద వద్దని జిల్లా(ట్రైని) అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జహీద్ తెలిపారు. మోపిదేవి మండలం పెదప్రోలు, కొక్కిలిగడ్డ పీఏసీఎస్ కార్యాలయంలో రైతులకు యూరియా పంపిణీ చేస్తున్న విధానాన్ని ఆమె పరిశీలించారు. రైతుల నుంచి యూరియా పంపిణీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ హరనాథ్, సొసైటీ ఛైర్మన్ నాదెళ్ల శరత్ చంద్రబాబు, రైతులు ఉన్నారు.
Similar News
News September 8, 2025
మచిలీపట్నంలో మీకోసం కార్యక్రమం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.
News September 8, 2025
కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ కృష్ణా: 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా రెడీ
☞ మచిలీపట్నం: పర్యాటకుల జేబులకు చిల్లు.!
☞ మోపిదేవిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
☞ గుడివాడ- కంకిపాడు రోడ్‌లో గుంతలో పడి వ్యక్తి మృతి
☞ మొవ్వలో రూ.1.70 లక్షల విలువైన యూరియా సీజ్
☞పోరంకిలో విజయవాడ ఉత్సవ్ సన్నాహక కార్యక్రమం
☞ జూపూడిలో మందు గుండు సామాగ్రి కలకలం
☞ అవినిగడ్డ మాజీ ఎమ్మెల్యేకి వైసీపీలో కీలక పదవి
News September 7, 2025
కృష్ణా: 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా రెడీ

జిల్లాలో రైతులకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ తెలిపారు. ఆదివారం పామర్రు, గూడూరు మండలాల పర్యటన అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, అధికారులతో సమావేశమై యూరియా స్థితిగతులపై సమీక్షించారు. అవసరమున్న రైతులకు ప్రాధాన్యతగా సరఫరా చేయాలని సూచించారు.