News October 6, 2025
జిల్లాలో యూరియా నిల్వలున్నాయ్: కలెక్టర్

జిల్లాలో యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ సోమవారం తెలిపారు. వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో ఆర్‌ఎస్‌కేలు, ప్యాక్స్ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 186 మెట్రిక్ టన్నుల యూరియాను 1,945 మంది రైతులకు అందజేసినట్లు ప్రకటించారు. అదనంగా 166 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలో ఉన్నందున అవసరమైన రైతులు సమీప కేంద్రాలకు వెళ్లి పొందవచ్చని సూచించారు.
Similar News
News October 6, 2025
రంగారెడ్డి: తాగి వస్తున్నాడని తండ్రిని చంపేశాడు..!

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దామర్లపల్లిలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామంలో ఓ వ్యక్తి తన తండ్రిని చంపేశాడు. తన తండ్రి మద్యం తాగి ఇంటికి వచ్చి రోజు గొడవ చేస్తున్నాడని దీంతో కోపం వచ్చి కొట్టి చంపానని చెప్పాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 6, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓స్థానిక ఎన్నికల కోసం నోడల్ అధికారుల నియామకం
✓స్థానిక ఎన్నికలపై అధికారులకు కలెక్టర్ జితేశ్ సూచనలు
✓అశ్వరావుపేట: కోడిపందాల రాయుళ్లు అరెస్ట్
✓భద్రాచలం: తల్లిదండ్రులపై కొడుకు దాస్టీకం
✓ రామన్నగూడెంలో జాయింట్ సర్వే
✓జూలూరుపాడులో స్మశాన వాటిక స్థలం ఆక్రమణ
✓పోగొట్టుకున్న ఫోన్ తిరిగి అప్పగించిన పాల్వంచ ఎస్సై
✓ జూలురుపాడు: భార్యను చంపిన భర్త