News January 12, 2025

జిల్లాలో రూ. 14 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం: మంత్రి టీజీ

image

క‌ర్నూలు జిల్లా ఓర్వ‌క‌ల్లు పారిశ్రామిక పార్కులో సెమీ కండక్టర్ రంగంలో రూ. 14 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు ఒప్పందం కుదిరిందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఇండిచిప్ సెమి కండక్టర్ లిమిటెడ్ కంపెనీ తన భాగస్వామి జపాన్‌కు చెందిన యిటోయే మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వంతో హైదరాబాదులో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎం.ఓ.యూ కుదుర్చుకున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు.

Similar News

News February 10, 2026

వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్: ఎంపీ

image

2026–27 కేంద్ర బడ్జెట్ వికసిత భారత్ దిశగా ముందడుగు అని ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌పై ధన్యవాద తీర్మానంలో మాట్లాడిన ఆయన.. ఆర్థిక క్రమశిక్షణతో దూరదృష్టి కలిగిన బడ్జెట్‌ను సమర్పించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలిపారు. బడ్జెట్‌లో మేక్ ఇన్ ఇండియా, మౌలిక వసతుల అభివృద్ధి, ఆర్థిక వృద్ధి వేగవంతం, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు.

News February 10, 2026

మహా శివరాత్రికి శైవక్షేత్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని శైవక్షేత్రాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, డీఎస్పీలు, తహశీల్దార్లు, ఎండోమెంట్స్ అధికారులతో సమీక్షించారు. దేవాలయాల్లో పారిశుద్ధ్యం, క్యూలైన్లు, బ్యారికేడింగ్, తాగునీరు, షేడ్‌లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

News February 10, 2026

పీహెచ్సీల్లో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

image

పీహెచ్సీల్లో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి వాట్సప్ గవర్నెన్స్‌పై అధికారులతో సమీక్ష ద్వారా మాట్లాడారు. వాట్సప్ గవర్నెన్స్‌లో ఈ నెల కూడా జిల్లా మొదటి స్థానంలో ఉండాలని అన్నారు. నాలుగు రోజుల్లోపు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.