News October 15, 2025
జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఇలా..

జగిత్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో పెగడపల్లిలో అత్యధికంగా 8.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కథలాపూర్‌లో 4.8, మల్యాల 1.8, ఐలాపూర్, జగ్గసాగర్ లో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. మంగళవారం పూడూరులో అత్యల్పంగా 21.6° ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News October 15, 2025
MGU డిగ్రీ పరీక్ష ఫీజు.. 25 వరకు గడువు

నల్గొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం(ఎంజీయూ) పరిధిలోని డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈ నెల 25వ తేదీ ఆఖరు అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (సీఓఈ) డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఆలస్య రుసుం రూ.100తో అక్టోబరు 27 వరకు ఫీజు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.
News October 15, 2025
అంతరపంటగా ‘అనప’.. ఎకరాకు రూ.10వేల ఆదాయం

రబీలో వేరు శనగ, జొన్న, ఆముదం, కంది పంటల్లో అంతరపంటగా సాగు చేయడానికి అనపకాయలు అనుకూలం. 60-70 రోజులకు పూతకు వచ్చి 130 రోజుల్లో పంట కాలం పూర్తవుతుంది. ఎకరాకు 1-2KGలను 90*20సె.మీ దూరం ఉండేలా గొర్రు లేదా నాగలితో విత్తుకోవాలి. ఎకరాకు 8KGల నత్రజని, 20KGల భాస్వరం, 10KGల పొటాష్‌నిచ్చే ఎరువులను వేసుకోవాలి. ఎకరాకు సాగు ఖర్చు రూ.1,500-2K, నికర ఆదాయం రూ.10K వరకు ఉంటుంది.
News October 15, 2025
MBNR: మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎమ్మెల్యేలు

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల దామోదర్ రెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం బెంగుళూరులోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. మల్లికార్జున ఖర్గే ఆరోగ్య సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాజా రాజకీయాలపై చర్చించారు.