News October 10, 2025
జిల్లాలో సదరన్ క్యాంప్‌లను నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో పక్కాగా సదరన్ క్యాంపులను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌వో, డీసీహెచ్ఎస్, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్, డీఆర్ డీఏ పీడీలతో ఆమె సమీక్షించారు. దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుల అప్పీల్స్ మేరకు దివ్యాంగత్వం శాతాన్ని తిరిగి లెక్కింపు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు.
Similar News
News October 10, 2025
జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారులకు ఊతం: కలెక్టర్

జీఎస్టీ స్లాబ్ రేట్ల తగ్గింపుతో వినియోగదారునికి మరింత ఊతం లభించిందని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఈ ప్రయోజనంపై చివరి వ్యక్తి వరకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆమె ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించి, తగ్గింపు రేట్లను పరిశీలించారు.
News October 10, 2025
నేటి నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు పునః ప్రారంభం

ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను శుక్రవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ఈఓ మూర్తి తెలిపారు. ఈ నెల 2 నుంచి 9 వరకు ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. వీటిని పురస్కరించుకుని ఈ 8 రోజులు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. బ్రహ్మోత్సవాలు ముగియడంతో వీటిని పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. భక్తులు గమనించాలని కోరారు.
News October 10, 2025
భీమవరం: డీడీఓలకు రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష

ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు జీపీఎఫ్, పెన్షన్ కేసుల పరిష్కారానికి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్లో వివిధ శాఖల డీడీఓలకు రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ శాంతి ప్రియ మాట్లాడుతూ.. అకౌంటింగ్, బిల్స్‌కు సంబంధించిన విషయాలలో డీడీవోలు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.