News August 21, 2025
జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు: కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. బుధవారం ఆమె సిర్గాపూర్‌లో ఫర్టిలైజర్ దుకాణంలో ఎరువుల విక్రయాలను పరిశీలించారు. జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన యూరియా సమృద్ధిగా ఉందని తెలిపారు. యూరియాను పంట సాగుకు మాత్రమే వినియోగించాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ టీం అక్రమ రవాణా జరగకుండా చూస్తుందన్నారు.
Similar News
News August 21, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు SSR విడుదల

కేంద్ర ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR) షెడ్యూల్ విడుదల చేసిందని HYD జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. బుధవారం GHMC ప్రధాన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు SSR నిర్వహించనున్నట్లు తెలిపారు. జులై 1 నాటికి 18ఏళ్లు నిండిన వారు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలన్నారు.
News August 21, 2025
ఖమ్మం: నిల్వ మిర్చి రైతులకు అనూహ్య లాభం

మిర్చి ధరల్లో ఒక్కసారిగా పెరుగుదల నమోదైంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కొద్ది రోజులుగా క్వింటాకు రూ.14,500గా ఉన్న ధర బుధవారం రూ.15,300కు చేరింది. ఒకేరోజు క్వింటాకు రూ.800 పెరగడంతో నిల్వ ఉంచిన మిర్చి రైతులు తమ పంటను అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. గత ఏడాది రూ.18 వేలకు పైగా పలికిన ధర ఏడాది రూ.10వేలకు పడిపోవడంతో ఆందోళన చెందగా ప్రస్తుతం రూ.15,300కు ధర పెరగడంతో రైతులు తమ పంటను అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు.
News August 21, 2025
ఈనెల 22న ఈజీఎస్ పనుల జాతర

ఉపాధి హామీలో పూర్తయిన పనులను ప్రారంభించుటకు కొత్త పనులకు భూమి పూజ చేయుటకు ‘పనుల జాతర’ ను ఈనెల 22న ప్రారంభించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి తెలిపారు. జిల్లాలోని 15 మండలాల్లో గల 335 గ్రామాల్లో ఒకేసారి పనులు ప్రారంభించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. EGS, వాటర్ షెడ్, RES, PR ఇంజనీరింగ్, స్వచ్ఛభారత్ ద్వారా చేపట్టిన, చేపట్టనున్న పనులను ప్రారంభించాలన్నారు.