News November 9, 2024
జిల్లాలో సుమారు 2.63 లక్షల కుటుంబాలు: వరంగల్ కలెక్టర్
వరంగల్ జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పక్కా ప్రణాళికతో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వరంగల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సుమారు 2.63 లక్షల కుటుంబాలున్నట్లు ఉప ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రతి ఇంటి సర్వేకు పటిష్ట ప్రణాళిక చేశామని జిల్లా కలెక్టర్ వివరించారు.
Similar News
News November 24, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైం న్యూస్..
> MHBD: ఉరి వేసుకుని మహిళా ఆత్మహత్య..
> JN: సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు..
> NSPT: రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు..
> MHBD: విషపు నీటితో వానరం మృత్యువాత?
> HNK: కల్వర్టు కిందికి దూసుకెళ్లిన టిప్పర్..
> MHBD: రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన..
> NSPT: చిత్తుబొత్తు ఆడుతున్న వ్యక్తుల అరెస్ట్
News November 23, 2024
జనగామ: మధ్యాహ్న భోజనం తయారీలో జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్
మధ్యాహ్నం భోజనం తయారీలో ప్రధానోపాధ్యాయులు తగు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి అన్ని పాఠశాలల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనం తయారీ చేసే ప్రదేశాలు, పిల్లలు తినే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.
News November 22, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..
> BHPL: అంబటిపల్లిలో హనుమాన్ విగ్రహం దగ్ధం!
> MLG: అన్న దమ్ములను హతమార్చిన మావోలు
> HNK: మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు
> MHBD: అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు
> PLK: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
> HNK: రాత్రి పూట ఇళ్ళల్లో దొంగతనం చేసే అంతరాష్ట్ర దొంగ అరెస్టు
> JN: ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించిన జడ్జి