News March 17, 2025

జిల్లాలో 128 కేంద్రాలు.. 26,497 విద్యార్థులు

image

పల్నాడు జిల్లాలో నేటి నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలకు మొత్తం 128 కేంద్రాలను ఏర్పాటు చేశామని డీఈవో చంద్రకళ తెలిపారు. ఆ పరీక్షా కేంద్రాలలో 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వారిలో 12,869 మంది రెగ్యులర్ బాలురు, 12,778 మంది రెగ్యులర్ బాలికలు ఉన్నారు.586 మంది ప్రైవేట్ బాలురు,304 మంది బాలికలు ప్రైవేటుగా పరీక్షలు రాస్తున్నారు. 6గురు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 6 సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు.

Similar News

News March 17, 2025

అందుకే తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు: రేవంత్ రెడ్డి

image

TG: పొట్టి శ్రీరాములు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం ఉందని సీఎం రేవంత్ తెలిపారు. ఆయన గొప్ప దేశభక్తుడని కొనియాడారు. అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత విముక్తికి పోరాడిన గొప్ప వ్యక్తుల పేర్లను యూనివర్సిటీలకు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు వర్సిటీలకు పేర్లు మార్చినట్లు గుర్తు చేశారు. ఆ కోవలోనే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టాలని నిర్ణయించామన్నారు.

News March 17, 2025

BREAKING: మోదీ పాడ్‌కాస్ట్ షేర్ చేసిన ట్రంప్

image

ప్రధాని నరేంద్రమోదీపై US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి అభిమానం చాటుకున్నారు. US పాడ్‌కాస్టర్, AI పరిశోధకుడు లెక్స్ ఫ్రైడ్‌మన్‌కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూ వీడియోను తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు. మూడు గంటల నిడివి ఉన్న ఈ పాడ్‌కాస్ట్‌లో RSSతో అనుబంధం, భారత్‌కు నిర్వచనం, సంస్కృతి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ పాలన సహా అనేక అంశాలపై మోదీ తన అభిప్రాయాలు పంచుకున్నారు.

News March 17, 2025

భారీగా కార్ల ధరలు పెంచుతున్న మారుతీ సుజుకీ

image

కస్టమర్లకు మారుతీ సుజుకీ షాకిచ్చింది. 2025, APRIL నుంచి కార్ల ధరలను 4% వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ముడి వనరుల ధరలు, ఆపరేషనల్ కాస్ట్ పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. మోడల్‌ను బట్టి కస్టమర్లపై తక్కువ భారం వేసేందుకే ప్రయత్నించామని వెల్లడించింది. 2025లో ఈ కంపెనీ ధరలు పెంచడం ఇది మూడోసారి. గత DEC ప్రకటించిన 4% పెంపు JANలో అమల్లోకి వచ్చింది. FEBలో మోడల్‌ను బట్టి రూ.1500-32,500 వరకు పెంచింది.

error: Content is protected !!