News September 11, 2025
జిల్లాలో 1873 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది: కలెక్టర్

జిల్లాలో ఎరువుల పంపిణీపై వ్యవసాయ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం సమీక్షించారు. ఇప్పటి వరకు జిల్లాలో 78,145 మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేశామన్నారు. 1,873 మెట్రిక్ టన్నుల యూరియా, 26 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేదన్నారు. ఎక్కడైనా ఎరువుల పంపిణీలో సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.
Similar News
News September 11, 2025
గర్భిణులకు పీహెచ్‌సీలలో కాన్పులు చేయించాలి: DMHO

కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన ఆశా ఫెసిలిటేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (పీహెచ్‌సీ) మొదటి కాన్పుల కోసం గర్భిణులను ప్రోత్సహించాలని సూచించారు. తద్వారా సాధారణ ప్రసవాలు జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు.
News September 11, 2025
గంగారాం: ఒకే రోజు నాలుగు డెలివరీలు!

గంగారం మండలం కోమట్లగూడెం ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలలో డా.సాయినాథ్ ఒకేరోజు నాలుగు డెలివరీలు చేసి ఏజెన్సీ ప్రాంతంలో రికార్డు సృష్టించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల(డెలివరీ) సంఖ్య సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతమైన కోమట్లగూడెంలో ఒకే రోజు నాలుగు డెలివరీలు చేయడం విశేషం. ప్రజల ఆరోగ్యం కోసం ఎంతో శ్రమించి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్‌ను స్థానికుల అభినందించారు.
News September 11, 2025
KMR: 73 మందికి జరిమానా.. ఒకరికి జైలు

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై KMR జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 73 మందికి కోర్టు జరిమానా విధించింది. బిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. మద్యం తాగి వాహనం నడపడం ప్రాణాంతకమని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు.