News October 29, 2025

జిల్లాలో 1,937 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు: మంత్రి నాదెండ్ల

image

ఏలూరు జిల్లాలో 54 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి, తుఫాను బాధితులైన 1,937 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతీ కేంద్రంలో భోజన, వసతి, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 148 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, 318 మంది గర్భిణులను పీహెచ్‌సీల్లోకి తరలించామని ఆయన మంగళవారం రాత్రి పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

Similar News

News October 29, 2025

త్వరలో మదనపల్లి జిల్లా సాకారం..?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా మూడు జిల్లాలుగా మారింది. నాడు అన్నమయ్య జిల్లాకు కలవడం కంటే మదనపల్లి జిల్లా కావాలని డిమాండ్ బలంగా వినిపించింది. దీనికి అనుకూలంగా మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై సీఎం చర్చించారు. త్వరలో దీనిపై ఆమోదం తెలిపి మదనపల్లి జిల్లా కేంద్రం అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు పుంగనూరు లేదా పీలేరు రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. జిల్లా కేంద్రం మదనపల్లిపై మీ కామెంట్ చెప్పండి..!

News October 29, 2025

ఈ జిల్లాల్లో యథావిధిగా స్కూళ్లు

image

AP: మొంథా తుఫాను బలహీనపడింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిన్నటి వరకు సెలవులు కొనసాగిన అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ స్కూళ్లు యథావిధిగా నడవనున్నాయి. ఈమేరకు అధికారులు వెల్లడించారు. అటు తిరుపతి జిల్లాకు తొలుత ఇవాళ కూడా హాలిడే ప్రకటించినా.. తుఫాను ప్రభావం లేకపోవడంతో సెలవు రద్దు చేశారు. స్కూళ్లు కొనసాగుతాయని, విద్యార్థులు రావాలని సూచించారు.

News October 29, 2025

ఖమ్మం జిల్లాలో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

image

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అన్ని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.