News October 3, 2025
జిల్లాలో 210 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది: కలెక్టర్

జిల్లాలో యూరియా కొరత లేదని, ఇంకా 210 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. యూరియా అవసరమైన రైతులు తీసుకువెళ్లవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రం, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా ఇప్పటి వరకు 342 మెట్రిక్ టన్నుల యూరియాను 3,753 మంది రైతులకు పంపిణీ చేసినట్లు వివరించారు.
Similar News
News October 3, 2025
గుంటూరులో ‘పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ డే’లో ఎస్పీ

SP వకుల్ జిందాల్ పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ‘పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ డే’లో పాల్గొన్నారు. ఐదుగురు పోలీస్ సిబ్బంది తమ బదిలీ, సర్వీస్ సంబంధిత సమస్యలపై వినతి పత్రాలను SPకి సమర్పించారు. SP వాటిని సానుకూలంగా స్వీకరించి, సంబంధిత అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి, వారి వినతుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని SP పేర్కొన్నారు.
News October 3, 2025
మూడో భార్యకూ విడాకులు ఇవ్వనున్న మాలిక్?

సానియా మీర్జా మాజీ భర్త, పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన భార్య సనా జావెద్‌కు విడాకులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఆమె మూడో భార్య కాగా ఇది మూడో విడాకులు. తొలుత ఆయేషాను పెళ్లాడిన మాలిక్ 8 ఏళ్ల తర్వాత ఆ బంధానికి ముగింపు పలికారు. 2010లో సానియాను పెళ్లాడారు. 13 ఏళ్ల తర్వాత ఆమెకూ విడాకులిచ్చారు. వీరికి ఓ కొడుకు ఉన్నారు. ఇక 2024లో సనాను పెళ్లి చేసుకున్న ఆయన ఏడాదిలోనే విడాకులకు సిద్ధమయ్యారు.
News October 3, 2025
APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయొద్దు: SP

బాపట్ల SP ఉమామహేశ్వర్ శుక్రవారం జిల్లా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ నేరగాళ్లు వినూత్న రీతిలో నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజల మొబైల్ ఫోన్లకు వాట్సాప్ ద్వారా APK ఫైల్స్ పంపించి తద్వారా ఫోన్ హ్యాక్ చేస్తున్నారన్నారు. బ్యాంకు, వ్యక్తిగత వివరాలను దొంగిలిస్తున్నారని తెలిపారు. ప్రజలు APK ఫైల్స్ డౌన్‌లోడ్ లేదా ఓపెన్ చేయొద్దని హెచ్చరించారు. కేవలం అధికారిక యాప్స్ మాత్రమే వాడాలన్నారు.