News March 1, 2025
జిల్లాలో 38 పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

KMR జిల్లాలో 38 కేంద్రాలలో 18,469 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ తెలిపారు. మొదటి సంవత్సరంలో 8743 మంది, ద్వితీయ సంవత్సరంలో 9726 మంది పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. మార్చి 5 నుంచి 25 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రంలో తాగునీరు, విద్యుత్ సరఫరా, మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News March 1, 2025
కడిమెట్లలో జిల్లా కలెక్టర్ పర్యటన

ఎమ్మిగనూరు మండలం కడిమెట్లలో జరుగుతున్న భూ రీసర్వేను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా శనివారం పరిశీలించారు. ఎమ్మార్వో శేషఫణితో కలిసి రీ సర్వేలో రైతుల నుంచి వస్తున్న సమస్యలను తెలుసుకున్నారు. మండలంలో నెలకొన్న భూ, తదితర సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సర్వేను పూర్తి చేయాలని సూచించారు.
News March 1, 2025
GHMCలో 139 మంది శానిటేషన్ జవాన్ల బదిలీ.!

GHMC కమిషనర్ ఇలంబర్తి 139 మంది శానిటేషన్ జవాన్లను బదిలీ చేశారు. మొత్తం 259 మంది సిబ్బందిలో ఐదేళ్లకుపైగా ఒకే చోట పనిచేస్తున్న వారిని మార్చినట్లు తెలిపారు. నగర శుభ్రతను మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. శానిటేషన్ సేవల్లో సమర్థత పెంచేందుకు ఈ చర్యలు అవసరమని కమిషనర్ స్పష్టం చేశారు.
News March 1, 2025
చట్టానికి లోబడి బాధితులకు న్యాయం చేయండి: సీపీ

న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా అధికారులకు సూచించారు. నెలవారీ సమీక్షలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ శనివారం కమిషనరేట్ కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్, డివిజినల్, జోన్ల వారీగా సమీక్ష జరిపారు.