News February 18, 2026

జిల్లాలో 52వేల మందికి టీబీ పరీక్షలు: DMHO వెంకటరమణ

image

జిల్లాను క్షయ రహితంగా మార్చేందుకు వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పెండెం వెంకటరమణ పిలుపునిచ్చారు. బుధవారం నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 52,000 మందికి టీబీ పరీక్షలు చేయగా, 765 మందికి చికిత్స అందిస్తున్నామన్నారు. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, ఆధునిక సాంకేతికతతో త్వరితగతిన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News April 5, 2026

రామగుండం-మణుగూరు రైల్వేకు గ్రీన్ సిగ్నల్

image

సింగరేణి బొగ్గు గనుల అనుసంధానమే లక్ష్యంగా చేపట్టిన రామగుండం–మణుగూరు రైల్వే లైన్‌కు కేంద్ర బడ్జెట్‌లో రూ.2,911.84 కోట్లు కేటాయించారు. 207KM పొడవైన ఈ మార్గం పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల మీదుగా సాగనుంది. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ వేగవంతం కాగా, ఈ లైన్‌ పూర్తయితే రామగుండం–మణుగూరు మధ్య దూరం 90KM తగ్గి రాకపోకలు సులభతరం కానున్నాయి. కోల్‌ కారిడార్‌లో ఈ రైలు మార్గం అత్యంత కీలకం కానుంది.

News April 5, 2026

భద్రాద్రి: మనస్తాపంతో చెట్టుకు ఉరేసుకొని వ్యాపారి ఆత్మహత్య

image

సారపాకకు చెందిన స్క్రాప్ వ్యాపారి ప్రవీణ్ కుమార్ రెడ్డి(42) మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని బేగంపేట సమీప రెనెక్సా టవర్స్ వద్ద కారులో సూసైడ్ నోట్ ఉంచి చెట్టుకు ఉరి వేసుకున్నారు. వ్యాపారంలో రావాల్సిన సుమారు రూ.6.8 కోట్లు రాకపోవడం, రూ.3.5 కోట్లతో కొనుగోలు చేసిన ఇల్లు నకిలీ పత్రాలతో మోసం చేశారన్న ఆవేదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

News April 5, 2026

NTR: ఆశ చూపి రూ.9 లక్షలతో పరార్

image

కంచికచర్లకు చెందిన బాష గుప్త పూజల పేరుతో మోసపోయాడు. డబ్బు రెట్టింపు చేస్తామని చెప్పిన ఓ అపరిచితుడి మాటలకు లోనై రూ.9 లక్షలతో షాద్నగర్ చేరుకున్నాడు. ముఠా సభ్యులు అతణ్ని ఒంటరిగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేసి, నగదు దోచుకుని పరారయ్యారు. షాక్‌కు గురైన బాషా పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.