News August 23, 2025

‘జిల్లాలో 76 వేల హెక్టార్లలో పంటల సాగు’

image

బాపట్ల జిల్లాలో 76 వేల హెక్టార్లలో పంటల సాగు ప్రారంభమైందని వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రతి ఏటా ఆగస్టులో చేపట్టే పంటల సాగు కంటే అదనంగా 22,898 హెక్టార్లలో పంటలు వేశారన్నారు. మెట్ట ప్రాంతాల్లో సైతం పంటల సాగు మొదలైందని వివరించారు. 577 మెట్రిక్ టన్నుల ఎరువులు, పురుగు మందులను ఆర్ఎస్కేలలో ఉంచామన్నారు.

Similar News

News April 5, 2026

రాజంపేట: జాతర ఎప్పుడో తెలియదు.. జెయింట్ వీల్ వచ్చేసింది

image

రాజంపేటలో ప్రసిద్ధి చెందిన బలిజపల్లి గంగమ్మ జాతర ఎప్పుడు అనేది ఇంతవరకు ప్రకటన వెలువడలేదు. ఈరోజు, ఆరోజు అంటూ పుకార్లు షికార్లు చేస్తుండడంతో భక్తులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సంప్రదాయం ప్రకారం ఆ ప్రాంతంలోని కొన్ని కుటుంబాలకు మాత్రమే జాతర నిర్వహణ బాధ్యతఉంది. అందువల్ల ప్రతి ఏడాది ఇదే తంతు నడుస్తోంది. జాతర ఉంటుందని నమ్మి ఈ ఆదివారం వ్యాపారులు జెయింట్ వీల్ తీసుకొచ్చారు.

News April 5, 2026

శ్రీకాకుళం పోలీస్ కార్యాలయంలో జగ్జీవన్ జయంతి

image

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి డీఎస్పీ వివేకానంద పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, భారత దేశ ఉప ప్రధాని అని అన్నారు. దళిత వర్గాల ఆశాజ్యోతి అని, వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు.

News April 5, 2026

చెన్నూరు ఇటుక బట్టీలపై అధికారుల కొరడా

image

చెన్నూరు క్రాసింగ్ వద్ద ఇటుక బట్టీల పొగ, బూడిదతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ, కంటి వ్యాధుల ముప్పు ఉందని ప్రజలు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. నిబంధనల ప్రకారం జనావాసాలకు, హైవేకి 500 మీటర్ల దూరంలో బట్టీలు ఏర్పాటు చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఎంపీడీవో కిరణ్ మోహన్‌రావు తదితరులు యజమానులకు నోటీసులు జారీ చేశారు.