News January 10, 2026

జిల్లాల కుదింపు.. నల్గొండ రెండు జిల్లాలేనా..?

image

రాష్ట్రంలో జిల్లాల పునర్ విభజన చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అవుతోంది. చాలా జిల్లాల్లో గందరగోళం ఉండటంతో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 33 జిల్లాలను 17 జిల్లాలుగా సర్కార్ కుదించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రతి పార్లమెంట్‌ను ఒక్క జిల్లాకు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత సర్కార్ హయాంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు జిల్లాలు (NLG, యాదాద్రి, SRPT)గా విభజన చేశారు.

Similar News

News February 5, 2026

పాకిస్థాన్‌లో టాప్-1లో నిలిచిన ‘ధురంధర్’

image

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ OTTలోనూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ గత నెల 30న Netflixలో విడుదలై కేవలం 3 రోజుల్లోనే 7.6M వ్యూస్ సాధించింది. ‘యానిమల్’ (6.2M), ‘ఫైటర్’ (5.9M), ‘పుష్ప-2’ (5.8M) రికార్డులను బద్దలు కొట్టింది. థియేటర్లలో దాదాపు రూ.1300 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు OTTలోనూ దూసుకుపోతోంది. 7 దేశాల్లో టాప్-10లో నిలిచిన ‘ధురంధర్’ పాకిస్థాన్‌లో నంబర్-1లో నిలవడం విశేషం.

News February 5, 2026

విజయవాడ GGHలో వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి!

image

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అనస్థీషియా ఫైనల్ ఇయర్ చదువుతున్న దీపిక అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం సాయంత్రం విధుల్లో ఉన్న ఆమె, ఆహారం తెచ్చుకుంటానని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. గురువారం ఉదయం ఆమె మృతదేహం లభ్యమైంది. ACP దామోదర్ నేతృత్వంలో పోలీసులు కేసు నమోదు చేసి, ఆసుపత్రి పరిసరాల్లోని CC కెమెరా దృశ్యాలను విశ్లేషిస్తున్నారు.

News February 5, 2026

NLG: నిజాంకు ఎదురొడ్డి జైలు జీవితం.. వట్టికోట ఎందరికో స్ఫూర్తి

image

తెలంగాణ సాహిత్య వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి శాలిగౌరారం మండలం మాధవరంలో పుట్టారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన, పాదయాత్రల ద్వారా గ్రంథాలయ ఉద్యమాన్ని పల్లెపల్లెకూ తీసుకెళ్లారు. జైలు లోపల, ప్రజల మనిషి, కనువిప్పుతో పాటు ఇంకా ఎన్నో రచనలు చేశారు. నిజాంకు ఎదురొడ్డి జైలు జీవితం గడిపారు. నేటి విద్యార్థులకు పుస్తకాల రూపశిల్పిగా, అక్షర యోధుడిగా ఆయనే స్ఫూర్తిప్రదాత. కాగా నేడు ఆయన వర్ధంతి.