News December 29, 2025

జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్ ఆమోదం

image

AP: జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాల సంఖ్య 28కి చేరింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకి మార్చింది. రాయచోటిని మదనపల్లె జిల్లాకు, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాకు, రాజంపేటను కడప జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరుకు మార్చేందుకు ఆమోదం తెలిపింది.

Similar News

News February 9, 2026

పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు

image

పూజా ద్రవ్యాలను గౌరవించాలి. అందులో ఉపయోగించే గంట, శంఖం, తమలపాకులతో పాటు ఏ వస్తువులనూ నేరుగా నేలపై ఉంచకూడదు. వీటిని పీఠంపై లేదా ఓ పళ్లెంలో ఉంచాలి. అలాగే, భగవంతునికి సమర్పించే పువ్వుల రెక్కలను విడదీసి పూజించడం నిషిద్ధం. పువ్వును వికసించిన రూపంలోనే అర్పించాలి. పూజా సమయంలో శక్తివంచన ఉండకూడదు. ఎడమ చేతిని అస్సలు ఉపయోగించకూడదు. కేవలం కుడిచేతితోనే పూజా కార్యక్రమాలు నిర్వహించాలి.

News February 9, 2026

క్యారెట్‌తో ఎన్ని ప్రయోజనాలో?

image

క్యారెట్‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, బీటా-కెరోటిన్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపర్చి మలబద్ధకాన్ని నివారిస్తుంది. విటమిన్-A కంటిచూపును, విటమిన్-C రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చి, విటమిన్-K ఎముకలను ధృడంగా చేస్తుంది. వీటిని పచ్చిగా, ఉడికించి లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.

News February 9, 2026

మార్చి 31న సెలవు రద్దు: RBI

image

మార్చి 31(మహావీర్ జయంతి)న బ్యాంకుల సెలవు రద్దు చేస్తూ RBI ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం హాలీడే ఉన్నా ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆ రోజున పనివేళలు కొనసాగించాలని తెలిపింది. 2025-26 FYలోపే ప్రభుత్వ రసీదులు, చెల్లింపులకు సంబంధించి ట్రాన్సాక్షన్లు జరిగినట్లు పరిగణనలోకి తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. సాధారణ కార్యకలపాలపై కస్టమర్లు బ్రాంచ్‌ను ధ్రువీకరించుకోవడం ఉత్తమం.