News January 13, 2026

జిల్లాల పునర్విభజన ఇప్పుడు సాధ్యం కాదా?

image

TG: జిల్లాల పునర్విభజన చేపడతామన్న ప్రభుత్వ నిర్ణయానికి దేశవ్యాప్త జనగణన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. 2027 MAR 1 నుంచి జరిగే ఈ ప్రక్రియ నేపథ్యంలో జిల్లాల సరిహద్దులు ఇప్పట్లో మార్చొద్దని గతంలో కేంద్రం సూచించింది. దీనివల్ల జనగణనలో ఇబ్బందులు ఏర్పడి, జిల్లాలవారీ లెక్కలు తీయడం సాధ్యం కాదని చెప్పింది. మరి పునర్విభజనకు ప్రభుత్వం రెండేళ్లు ఆగుతుందా? లేదంటే ఎలా ముందుకెళ్తుంది? అనేది ఆసక్తికరం.

Similar News

News February 14, 2026

నిన్న థియేటర్లలో రిలీజ్.. వారానికే OTTలోకి!

image

రెజ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో నిన్న తెలుగులో రిలీజైన మలయాళ మూవీ ‘చథా పచ్చ’ వారానికే OTTలోకి రానుంది. ఈ నెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గత నెల 22న మలయాళంలో రిలీజైన ఈ మూవీ రూ.30కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. స్టార్ హీరో మమ్ముట్టి ఇందులో అతిథి పాత్రలో మెరిశారు. రెజ్లింగ్ క్లబ్ ఏర్పాటులో ముగ్గురు అన్నదమ్ములకు ఎదురైన సవాళ్ల ఇతివృత్తమే కథ.

News February 14, 2026

కొత్తగూడెంపై కమ్యూనిస్ట్ జెండా.. CPIకి కాంగ్రెస్ మద్దతు!

image

TG: హంగ్ ఏర్పడ్డ కొత్తగూడెం కార్పొరేషన్‌‌పై అధికార కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీపీఐకి మద్దతు తెలుపుతూ మేయర్ పీఠం ఆఫర్ చేసినట్లు సమాచారం. డిప్యూటీ మేయర్ పదవి తమకు ఇవ్వాలని కమ్యూనిస్ట్ నేతలతో సీఎం రేవంత్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్‌పై కమ్యూనిస్ట్ జెండా ఎగరనుంది. అటు ఇప్పటికే తామూ CPIకి మద్దతు ఇస్తామని BRS ఆఫర్ చేసిన విషయం తెలిసిందే.

News February 14, 2026

18 బంతుల్లోనే 50 రన్స్..

image

T20WCలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా(3 ఓవర్లు) 50 పరుగులు చేసిన రెండో టీమ్‌గా నిలిచింది. మార్క్రమ్ 14 బంతుల్లో 41, డికాక్ 4 బంతుల్లో 9 రన్స్ కొట్టారు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 2016లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ 2.5 ఓవర్లలోనే 50 బాదింది. కాగా ఇవాళ్టి మ్యాచ్‌లో SA పవర్ ప్లే ముగిసే సమయానికి 83/1 స్కోర్ చేసింది.