News December 15, 2025

జిల్లావ్యాప్తంగా సోమవారం పీజీఆర్ఎస్: కలెక్టర్

image

ఏలూరు కలెక్టరేట్‌, మండలం, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలు https://meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని చెప్పారు. వాటి స్థితిని 1100 నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

Similar News

News March 11, 2026

ఓవైపు ఎండ.. మరోవైపు వర్షం!

image

AP: రాష్ట్రంలో నేటి నుంచి ఎండ తీవ్రత స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్న అక్కడక్కడా జల్లులు కురిశాయి. పాక్షికంగా మేఘాలు ఆవరించడంతో పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. గరిష్ఠంగా నంద్యాలలో 36.2 డిగ్రీలు నమోదైంది.

News March 11, 2026

OTTలోకి 4 కొత్త సినిమాలు

image

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా OTT రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. దీనితో పాటు రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జీ5లో, విశ్వక్ సేన్ ‘ఫంకీ’ నెట్‌ఫ్లిక్స్‌లో ఎల్లుండి నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. హీరోయిన్ ప్రియాంకా మోహన్ నటించిన ‘మేడ్ ఇన్ కొరియా’ రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది.

News March 11, 2026

అనంత: ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.