News March 6, 2026
జిల్లాస్థాయి పోలీస్ స్పోర్ట్స్&గేమ్స్ మీట్ ప్రారంభం

పోలీస్ శాఖలో క్రీడల నిర్వహణ ఉద్యోగులకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. శుక్రవారం జిల్లా స్థాయి 4వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌ను ప్రారంభించారు. సుమారు 194 మంది సిబ్బంది పాల్గొన్న ఈ పోటీల్లో ట్రాక్ ఈవెంట్స్‌తో పాటు క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నారు. క్రీడల ద్వారా సిబ్బంది మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు.
Similar News
News April 2, 2026
VZM ఉమ్మడి జిల్లాలో డివిజన్లు, వార్డుల సంఖ్య పెంపు

ఉమ్మడి జిల్లాలో డివిజన్లు, వార్డుల సంఖ్య పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ వెలువడింది. విజయనగరం 50 నుంచి 62కు, సాలూరు 29 నుంచి 32కు, నెల్లిమర్ల 20 నుంచి 23కు, పార్వతీపురం 30 నుంచి 36కు, బొబ్బిలి 31 నుంచి 36కు, పాలకొండ 20 నుంచి 28 వార్డులకు పెంచారు. రాజాం అంశం కోర్టులో ఉంది. కమిషనర్ల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తుది నోటిఫికేషన్ రానుంది.
News April 2, 2026
ఉమ్మడి ప.గో.లో పెరిగిన వార్డుల సంఖ్య

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఉమ్మడి ప.గో. జిల్లాలో కొన్ని మున్సిపాలిటీల స్వరూపం మారనుంది.
నిడదవోలు 28 నుంచి 32
జంగారెడ్డిగూడెం 29 – 32
నరసాపురం 31- 36
ఆకివీడు 20- 28
నూజివీడు 32- 36
News April 2, 2026
నేడు రాజ్యసభకు అమరావతి బిల్లు

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు నిన్న లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం లాంఛనమే కానుంది. అనంతరం బిల్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్దకు వెళ్తుంది. ఆమె ఆమోదముద్ర వేయగానే చట్ట రూపం దాలుస్తుంది. దీంతో ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి నిలిచిపోనుంది.


