News March 16, 2025

జిల్లా అధికారులను అభినందించిన జనగామ కలెక్టర్

image

స్టేషన్ ఘనపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను జిల్లా అధికారులందరినీ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అభినదించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు గత వారం రోజులుగా నిర్విరామంగా విశేష కృషి చేశారని కలెక్టర్ అన్నారు. అందరి సమన్వయ కృషి వల్లే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు.

Similar News

News November 4, 2025

అన్నమయ్య: చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి

image

పెనగలూరు మండలం తిరునంపల్లి గ్రామం సమీపంలోని గుంజనేరు వద్ద విషాదం నెలకొంది. చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు నీట మునిగి మృతి చెందారు. మృతులు శీను (47), మల్లికార్జున (37)గా స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాలను బయటకు తీసి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News November 4, 2025

ఇంటర్ బోర్డు ఆదేశాలు తప్పనిసరి: డీఐఈఓ

image

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో బోర్డు ఆదేశాలను తప్పక పాటించాలని డీఐఈఓ శ్రీధర్ సుమన్ అన్నారు. ఆయన మంగళవారం పర్వతగిరి, నెక్కొండ కళాశాలలను సందర్శించి అడ్మిషన్ల ప్రక్రియ, తరగతులు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, మానసిక వికాసానికి కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు.

News November 4, 2025

భూపాలపల్లి: నర్సింగ్ ఆఫీసర్ అనుమానాస్పద మృతి

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ 100 పడకల హాస్పిటల్‌లో నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అనిత ఆత్మహత్య చేసుకుంది. మంజుర్ నగర్లోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆమె అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.