News August 7, 2024

జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి: ప్రకాశం కలెక్టర్

image

జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రకృత్తి విపత్తులను ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధతపై అధికారులతో మంగళవారం సమీక్షించి మాట్లాడారు. 2047 నాటికి జిల్లా సాధించాల్సిన అభివృద్ధిని తెలిపేలా ప్రణాళికలు ఉండాలన్నారు. జిల్లా స్థాయి అధికారుల టూర్‌ డైరీలను పరిశీలిస్తానని తెలిపారు.

Similar News

News February 12, 2026

ప్రకాశం: నిర్మాణాలపై జేసీ సూచనలు

image

ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో జరిగే భవన నిర్మాణాలకు అనుమతుల జారీలో జాప్యం ఉండరాదని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. ఈ సంస్థకు వైస్ ఛైర్మన్‌గా ఉన్న ఆమె బుధవారం సిబ్బందితో ప్రకాశం భవనంలో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్, భవన నిర్మాణ అనుమతులపై జేసీ ఆరా తీశారు.

News February 11, 2026

అనుమతుల జారీలో జాప్యం ఉండరాదు: జేసీ

జిల్లా ప్రజలకు ప్రకాశం ఎస్పీ కీలక సూచనలు

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని శివాలయాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రముఖ ఆలయాల వద్ద చర్యలు చేపట్టామన్నారు. ఏదైనా సాయం కోసం డయల్ 100 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.