News December 10, 2025

జిల్లా అభివృద్ధిలో రహదారుల నిర్మాణం కీలకం: కలెక్టర్

image

జాతీయ రహదారుల నిర్మాణం బాగుంటే బాపట్ల జిల్లా అభివృద్ధి పట్టాలపై పయనిస్తుందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై కలెక్టర్ బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. అన్నిప్రాంతాలకు రవాణా సౌకర్యం, రహదారులు మెరుగ్గా ఉంటే అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో ఎస్సీ, సంక్షేమ సాధికారత అధికారిణి రాజదిబోరా పాల్గొన్నారు.

Similar News

News December 12, 2025

జగిత్యాల: ఈవీఎం భద్రతా వ్యవస్థలపై కలెక్టర్ సమీక్ష

image

దరూర్ క్యాంప్‌లోని ఈవీఎం గోదాంను కలెక్టర్ సత్యప్రసాద్ సమగ్రంగా తనిఖీ చేశారు. గోదాంలో ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, సీసీ కెమెరాల పనితీరు, యంత్రాల సాంకేతిక స్థితిని పరిశీలిస్తూ ఎన్నికల ప్రక్రియలో భద్రత అత్యంత కీలకమని తెలిపారు. నిరంతర పర్యవేక్షణ, ఎలాంటి లోపాలు లేకుండా వ్యవస్థలు పనిచేసేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్ ఉన్నారు.

News December 12, 2025

కోర్టులపై SMలో తప్పుడు విమర్శలు చేస్తే కఠినంగా ఉంటా: CJI

image

విచారణలో జడ్జిలు చేసే కామెంట్లపై SMలో తప్పుడు విమర్శల పట్ల CJI సూర్యకాంత్ ఆందోళన వ్యక్తపరిచారు. ఇలాంటి వాటిపై కఠినంగా ఉంటానని స్పష్టం చేశారు. ఇరువైపుల వాదనల బలాన్ని గుర్తించేందుకే జడ్జిలు వ్యాఖ్యలు చేస్తారని, అవే తుది నిర్ణయం కాదన్నారు. ట్రయల్ కోర్టు జడ్జి వ్యాఖ్యలు పక్షపాతంతో ఉన్నాయని, తనపై రేప్ కేసును బదిలీ చేయాలని కర్ణాటక EX MP ప్రజ్వల్ వేసిన పిటిషన్ విచారణలో CJI ఈ అంశాలు ప్రస్తావించారు.

News December 12, 2025

కామారెడ్డి: రెండో విడత ఎన్నికలకు రంగం సిద్ధం

image

కామారెడ్డి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి సంబంధించిన ర్యాండమైజేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తయ్యింది. కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. రెండో విడతలో లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి, మహ్మద్‌నగర్, నిజాంసాగర్, పిట్లం మండలాల్లో ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి.