News August 29, 2024
జిల్లా ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్ మేళా

గుంటూరు గుజ్జనగుండ్ల సర్కిల్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. రఘు తెలిపారు. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, పీజీ వరకు చదువుకున్న 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు.
Similar News
News December 29, 2025
REWIND: ఈ ఏడాది గుంటూరు జిల్లాలో క్రూరమైన ఘటన ఇదే..!

గుంటూరు జిల్లాలో ఈ ఏడాది జరిగిన నేరాల్లో ఫిరంగిపురంలో చోటుచేసుకున్న చిన్నారి హత్య అత్యంత హృదయవిదారక ఘటనగా మిగిలిపోయింది. మార్చి 29న ప్రకాశం పంతులు కాలనీలో సవతి తల్లి లక్ష్మి కిరాతకానికి ఆరేళ్ల కార్తీక్ బలైపోయాడు. పసివాడని కూడా చూడకుండా గోడకేసి కొట్టి చంపిన తీరు ప్రజలను కంటతడి పెట్టించింది. మరో చిన్నారిని సైతం పెనంపై కూర్చోబెట్టి హింసించిన లక్ష్మి రాక్షసత్వం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.
News December 29, 2025
REWIND: తెనాలిలో ఈ ఏడాది జరిగిన సంచలన ఘటన ఇదే..!

తెనాలిలో ఈ ఏడాది జరిగిన ఓ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. కానిస్టేబుల్‌పై దాడి కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు నడిరోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై కొట్టడం తీవ్ర కలకలం రేకెత్తించింది. ఇది జరిగిన నెల రోజుల తర్వాత మే 20న వీడియో వెలుగులోకి వచ్చింది. నిందితులను పరామర్శించేందుకు జూన్ 3న వైఎస్ జగన్ తెనాలి రావడం కూడా విమర్శలకు కారణమైంది. పోలీసుల చర్యలను కొందరు సమర్ధించగా మరికొందరు వ్యతిరేకించారు.
News December 29, 2025
2025 రివైండ్… గుంటూరు జిల్లాలో పాజిటివ్ న్యూస్

గుంటూరు జిల్లాకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిపి సుమారు రూ.955 కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాయి. రియల్ ఎస్టేట్ రంగంలో గుంటూరు దేశంలోనే వేగంగా ఎదుగుతున్న టియర్-2 నగరంగా నిలిచి, భూమి ధరలు 51 శాతం పెరిగాయి. ప్రజారోగ్య రంగంలో భాగంగా ప్రత్తిపాడులో రూ.150 కోట్లతో 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి మంజూరైంది. అలాగే గుంటూరు కాలువ ఆధునీకరణకు రూ.400 కోట్లు కేటాయించారు.


