News January 6, 2026

జిల్లా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌గా సుబ్బారాయుడు

image

తూ.గో. జిల్లా ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్‌గా బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు నియమితులయ్యారు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడైన ఆయన, 2026 నుంచి 2029 వరకు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షులు రాజా, కార్యదర్శి శ్రీనివాస్ ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.

Similar News

News February 3, 2026

రాజానగరంలో మెగా జాబ్ మేళా

image

రాజానగరం ZP ఉన్నత పాఠశాలలో ఈనెల 8న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు MLA బత్తుల బాలరామకృష్ణ మంగళవారం తెలిపారు. ఇందులో 60 మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొని 3000 మందికి ఉపాధి కల్పిస్తాయన్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు అర్హులని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News February 3, 2026

పొగాకు రైతులకు శుభవార్త

image

పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అన్ మాన్యుఫ్యాక్చర్డ్ పొగాకుపై ఉన్న 18 శాతం సుంకాన్ని రద్దు చేస్తూ మంగళవారం గెజిట్ విడుదల చేసింది. ఇటీవల రాజమండ్రి MP పురందీశ్వరి రైతులతో కలిసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి సుంకం ఎత్తివేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో పొగాకు రైతులకు భారీ ఊరట లభించనుంది.

News February 3, 2026

తూ.గో: స్కూల్ ఆటోలపై రవాణా శాఖ కొరడా

image

తూర్పుగోదావరి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను తరలిస్తున్న 11 ఆటోలపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. అందులో 7 ఆటోలను సీజ్ చేసినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ తెలిపారు. సోమవారం నిర్వహించిన తనిఖీల్లో పరిమితికి మించి పిల్లలను తరలిస్తున్నట్లు గుర్తించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా డ్రైవర్లు నియమాలు పాటించాలని, లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.