News October 3, 2025
జిల్లా జాగృతి అధ్యక్షుడిగా హరిప్రసాద్

కరీంనగర్ జిల్లా జాగృతి అధ్యక్షుడిగా గుంజపడుగు హరిప్రసాద్ నియామకయ్యారు. ఈ మేరకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకున్నారు. జాగృతి మొదలుపెట్టిన నాటి నుంచి జిల్లాలో క్రియాశీలకంగా పనిచేసినందుకు గాను జిల్లా జాగృతి అధ్యక్షుడిగా హరిప్రసాద్‌ను కవిత ఎంపిక చేశారు. కరీంనగర్ జిల్లాలో జాగృతి బలోపేతానికి మరింత కృషి చేస్తానని హరిప్రసాద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Similar News
News October 2, 2025
KNR: జంబిపూజ రాక్షస సంహారానికి పదేళ్లు..!

KNR పట్టణంలోని కిసాన్ నగర్లో 2015లో ప్రారంభమైన జంబిపూజ రాక్షస సంహారం కార్యక్రమం ఈ సంవత్సరంతో 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇక నేటి దసరా సంబరాలకు కిసాన్ నగర్ జంబిగద్దె వేదిక సిద్ధమైంది. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం స్థానికులు ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పదేళ్ల సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఈ ఏడాది కూడా వేడుకలను వైభవంగా జరుపుకోనున్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు.
News October 1, 2025
KNR: ‘నర్సరీలోని మొక్కలను సంరక్షించాలి’

నగరపాలిక ఆధ్వర్యంలో ఎల్ఎండీ సమీపంలో ఏర్పాటు చేసిన నర్సరీని కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. మొక్కలు ఎండిపోకుండా నీటిని అందిస్తూ ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు నర్సరీలో పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించి శుభ్రం చేయాలన్నారు. రోడ్డు డివైడర్ల మధ్యలో మొక్కలు నాటించాలని సూచించారు.
News October 1, 2025
డీఎస్పీగా మహేశ్వరి.. సీపీ గౌస్ ఆలం అభినందన

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలానికి చెందిన మోదుంపల్లి మహేశ్వరీ గ్రూప్-1 ఫలితాల్లో 474వ ర్యాంకు సాధించి డీఎస్పీ ఉద్యోగాన్ని దక్కించుకుంది. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో చదివిన ఆమె విజయంపై కరీంనగర్ సీపీ గౌస్ అలాం ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహేశ్వరీ విజయం గ్రామీణ యువతకు స్ఫూర్తిగా నిలిచింది.