News April 5, 2025

జిల్లా నాయకులకు కేసీఆర్ దిశా నిర్దేశం

image

ఈనెల 27న వరంగల్ వేదికగా BRS పార్టీ ఆవిర్భావం సందర్భంగా రజతోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం భద్రాద్రి జిల్లా ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రజతోత్సవ వేడుకలపై జిల్లా నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ భేటీలో జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చ నాగేశ్వరరావు, హరిప్రియ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Similar News

News November 10, 2025

పార్వతీపురం కలెక్టరేట్‌కు 99 వినతులు

image

అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సాధ్యమైనంత వరకు వెనువెంటనే సమస్యలు పరిష్కారించాలన్నారు. సమస్యల పరిష్కారంతో అర్జీదారులు సంతృప్తి చెందాలని, ఎట్టి పరిస్థితిల్లోనూ అర్జీలు పునరావృతం కాకూడదన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన PGRS ద్వారా 99 వినతులను స్వీకరించారు.

News November 10, 2025

మెదక్: స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరైన ఎంపీ

image

స్టాండింగ్ కమిటీ సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. న్యూఢిల్లీలోని లోక్‌సభ సచివాలయంలో జరిగిన సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయం తదితర కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయం స్టాండింగ్ కమిటీ సభ్యులుగా రఘునందన్ రావు ఉన్నారు.

News November 10, 2025

సిరిసిల్ల: పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మం.లో సోమవారం జరిగింది. స్థానికుల ప్రకారం.. తంగళ్లపల్లిలోని తన ఇంటి వద్ద మచ్చ జలంధర్(70) తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ క్రమంలో అతడి శరీరం బాగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివారలు సేకరిస్తున్నారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.