News August 27, 2025
జిల్లా నుంచి పారా జాతీయ స్థాయి పోటీలకు పయనం

పారా రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 13 మంది ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ వేదికగా ఈనెల 29 నుంచి 31 వరకు జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ -2025 జరగనుంది. ఈ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారులు బుధవారం బయలుదేరారు. వీరందరికి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులుదయానంద్ అభినందనలు తెలిపారు.
Similar News
News August 27, 2025
VZM: ‘పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి’

విజయనగరంలోని ఓ హోటల్లో టీడీపీ జిల్లా కమిటీ ఏర్పాటుపై త్రిసభ్య కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వాసంశెట్టి సుభాష్, శాసన మండలి మాజీ ఛైర్మన్ ఫరూఖ్, ఎమ్మెల్యే గణబాబు సభ్యులుగా వ్యవహారించి నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని కోరారు.
News August 27, 2025
VZM: ‘బిల్లుల చెల్లింపులకు ప్రతిపాదనలు పంపించండి’

నిర్మాణాలు పూర్తయిన MPFC (మల్టీ పర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్) గోదాముల బిల్లులు చెల్లింపులకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో సహకార, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్మాణాలు పూర్తయిన 11 గోదాములకు చివరి పేమెంట్ కోసం ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. పనులు మొదలుకాని గోదాములకు అనుమతులు రద్దు చేయాలని పేర్కొన్నారు.
News August 27, 2025
PM సూర్యఘర్‌లో జిల్లాకు 8వ స్థానం: JC

సోలార్ యూనిట్ల స్థాపనలో విద్యుత్ అధికారులు వారి లక్ష్యాలను సాధించాలని JC సేతు మాధవన్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జేసీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఏఏ బ్యాంక్‌ల వద్ద దరఖాస్తులు పెండింగ్ ఉన్నదీ జాబితా తీసుకొని పరిష్కరించాలని ఎస్.ఈకి సూచించారు. PM సూర్యఘర్ పథకంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా 8వ స్థానంలో ఉందని, గత 3 నెలల్లో ప్రగతి ఆశాజనకంగా ఉందని జేసీ అభినందించారు.