News June 21, 2024

జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తాం: ఎస్పీ దీపిక

image

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ నెల 24 నుంచి ప్రతి సోమవారం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని ఎస్పీ ఎం.దీపిక గురువారం తెలిపారు. ఇకపై ప్రతీ సోమవారం యధావిధిగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు.

Similar News

News October 31, 2025

లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు: VZM DMHO

image

PC & PNDT చట్టం ప్రకారం లింగ నిర్ధారణ నిషేధమని, ప్రతి స్కానింగ్ సెంటర్ తప్పనిసరిగా వివరాలు నమోదు చేసి సమర్పించాల్సిందేనని DMHO డా. జీవన రాణి తెలిపారు. DMHO కార్యాలయంలో జరిగిన సలహా మండలి సమావేశంలో ఆమె మాట్లాడుతూ..ప్రభుత్వానికి చెందిన 22 స్కానింగ్ సెంటర్లతో పాటు ప్రైవేట్ రంగంలో మరో 102 సెంటర్లు జిల్లాలో పనిచేస్తున్నాయని చెప్పారు. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 31, 2025

VZM: పాడుబడిన ఇంటి గోడ కూలి వృద్ధురాలి మృతి

image

విజయనగరం పట్టణ పరిధి గోకపేట రామాలయం పక్కన పాడుబడిన ఇంటి గోడ కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మృతురాలు రెయ్యి సన్యాసమ్మ కుమారుడు కాళీ ప్రసాద్ వివరాల ప్రకారం.. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్తుండగా దారిలో పాడుబడిన ఇంటి గోడ కూలి మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అదితి ఘటనా స్థలికి వెళ్లారు.

News October 31, 2025

వారణాసిలో సిక్కోలు వాసులు గాయపడడం బాధాకరం: మంత్రి

image

వారణాసి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది గాయపడిన ఘటన బాధాకరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. యూపీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని శ్రీకాకుళం అధికారులను ఆదేశించామన్నారు. గాయపడిన వారు కోలుకున్న వెంటనే స్వస్థలాలకు తిరిగి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.